By: ABP Desam | Updated at : 03 May 2023 10:33 PM (IST)
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలు, వాటి వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, జరిగిన పంట నష్టంపై జిల్లాల వారీగా సీఎం జగన్ సమీక్షించారు. బుధవారం జరిగిన విశాఖపట్నం పర్యటన నుంచి తాడేపల్లి నివాసానికి తిరిగి రాగానే సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
వర్షాల బారి నుంచి చేతికొచ్చిన పంటను కాపాడడానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం జగన్ అన్నారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ధాన్యాన్ని తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా, కొనుగోలు కేంద్రాల వద్ద కాని, ఆర్బీకేల వద్దకాని, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని జగన్ ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద ప్రతి కలెక్టర్‌కు రూ.కోటి రూపాయలు కేటాయించారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. పంట పొలాల్లో ఉన్న మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవాలని విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఉదయం ఆదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన
నేడు (మే 3) రుషికొండ హిల్ నెంబర్ 4లో అదానీ - వైజాగ్ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కాలేదు. ఆయన ఇద్దరు కుమారులు, అదానీ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జీత్, కరణ్ అదానీలు హాజరయ్యారు. విశాఖపట్నం డాటా టెక్నాలజీకి సెంటర్ గా మారుతుందని ఈ సందర్భంగా కరణ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అదానీ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32 వేల మందికి పైగా ఉపాధి దొరకనుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్ల ద్వారా మరో 3 వేల మందికిపైగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్ కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కాలేజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ కేంద్రానికి 9 ఎకరాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమి పూజ జరిగిన తర్వాత వెను వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఏకంగా, రూ. 21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ పట్నంలోని మధుర వాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయల చొప్పున 190.29 ఎకరాలను అదానీ గ్రూపుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?
Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?