అన్వేషించండి

Chandrababu Amaravati Review: రాజధాని ప్రగతి ప్రజలకు కనిపించాలి - గడువు కంటే ముందే పనుల పూర్తి - చంద్రబాబు ఆదేశం

Amaravati: అమరావతి నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష చేశారు. గడువు కంటే ఆరు నెలలు ముందే పనులు పూర్తయ్యేలా వేగంగా సాగాలన్నారు.

Chandrababu reviews Amaravati construction:   రికార్డు టైమ్ లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువు కంటే ఆరు నెలల ముందే పనుల్ని పూర్తి చేసి నగర నిర్మాణం పూర్తవ్వాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి సహా, వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి  సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పి.నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో పాటు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 

అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి 

ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో ఎల్పీఎస్ లే అవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా  మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాజధానిలో ప్రస్తుతం ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టు సంస్థలు ఆయా పనుల్ని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. రాజధానిలో చేపడుతున్న నిర్మాణ పనుల ప్రగతి ప్రజలకు కనిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ నెలా అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని సీఎం అన్నారు. సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే ఎందుకు కాలేదన్న అంశంపై సదరు కాంట్రాక్టు సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. దీంతో పాటు రియల్ టైమ్ లో పనుల పురోగతిని కూడా పర్యవేక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆటో పైలట్ మోడ్ లో పనులు జరగాలని సూచించారు. 

 రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్ల బదిలీ 

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్  కూడా ప్రభావితం కాకుండా ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగక పోవటంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము, సామాగ్రి తుప్పు పట్టి పోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఇసుకను భర్తీ చేయాల్సిందిగా మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

భూములిచ్చిన సంస్థలకు వేగంగా అనుమతులు 

రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. బిట్స్ పిలానీ, ఎక్స్ ఎల్ఆర్ఐ  తదితర సంస్థలకు త్వరితగతిన భూమిని కేటాయించాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన 72 సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సంస్థలకు స్థలం ఇచ్చేస్తేనే పని పూర్తి కాదని వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాలన్నారు. ఒక్కో ఇటుకా పేరిస్తేనే రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని సీఎం అన్నారు. రాజధాని నగరంలో పెట్టుబడులతో పాటు నగరాభివృద్ధి కూడా జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. పెద్ద ప్రాజెక్టులను సీబీఎన్ మాత్రమే సమర్ధంగా చేయగలుగుతారని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ కూడా చెప్పారని.. ఈ క్రెడిబిలిటికి నష్టం కలగకుండా చూడాలన్నారు. అమరావతిలో  స్పోర్ట్ సిటీ, పర్యాటక ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్, బయోటెక్నాలజీ, విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.

ఎకానమీ, ఎంప్లాయిబిలిటీ, లివబులిటీ లక్ష్యం 
 
కేవలం భవనాల అభివృద్ధితో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదని ఆర్ధిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉందని తెలిపారు. నిర్మాణాలను పూర్తి చేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వచ్చి ఆర్ధికంగా పరిపుష్టం అవుతుందన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు నివాస యోగ్యమైన నగరంగా అమరావతి మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాలెడ్జి ఎకానమీ, స్టార్టప్స్ లాంటి ఎకో సిస్టం కూడా రాజధాని నగరంలో కల్పించాలని సూచించారు. దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడా ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని సీఎం పేర్కోన్నారు. రాజధాని నగరాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా మార్చేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. సీడ్ కేపిటల్,క్యాపిటల్ సిటీ, కేపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో కూడా నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Embed widget