అన్వేషించండి

ఏపీఎస్‌ఆర్టీసీకి నిజమైన పండగ ఇదే- ఒక్క రోజులోనే 23కోట్లు ఆదాయం!

సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా ఎక్కువ  ఆదాయం  నమోదైంది. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించింది. గతంలో ఒక రోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉంది.

ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని సాధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్‌ రికార్డు స్థాయి ఆదాయం నమోదవుతుంది. టిక్కెట్ల ధరలను పెంచకుండానే సంస్థకు ఆదాయం దక్కింది. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని అధికారులు అంటున్నారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులు ప్రయాణ భారాన్ని తగ్గించుకునేందుకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులనే ఎంచుకున్నారు. ఇతర ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. 

కార్గో సేవల్లో కూడా...

సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా ఎక్కువ  ఆదాయం  నమోదైంది. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించింది. గతంలో ఒక రోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉంది. ఈసారి దాన్ని అధిగమించింది. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడం, ఎప్పటికప్పుడు బస్సులు పర్యవేక్షించడం,రద్దీకి తగ్గట్టు బస్సుల ఏర్పాటు వల్లనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారి కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఈ ఘనత సాధించామని కితాబు ఇచ్చారు. పర్యవేక్షణలో అధికారుల సహాయసహకారాలనూ కూడా కొనియాడారు. కార్గో పట్ల, ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ మరువలేనిదంటున్నారు. 

ఇక సంక్రాంతికి అయితే...

సంక్రాంతికి ముందు రోజుల్లో జనవరి 6 నుంచి 14 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను ఏపీఎస్ వైపు ఆకర్షించేలా చేసిందని ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను నడిపిందని చెప్పారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి స్థూల ఆదాయం బాగా పెరిగిందని అంటున్నారు. 

గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయాన్ని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్జించిందని తిరుమలరావు తెలిపారు. గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి  మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
AP Local Body Elections: ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ
ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు.. కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఈసీ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget