అన్వేషించండి

చంద్రబాబు మాటలను సమర్థించిన మంత్రి అంబటి- ఆసక్తిగా మారిన కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిత్యం వార్తలో ఉంటారు. ఆయన చేసే కామెంట్స్, హావ భావాలు, ప్రతిపక్షాలపై ఎదరు దాడి చేసేందుకు ఉపయోగించే పదజాలంతో అట్రాక్ట్ చేస్తుంటారు.

అదేంటయ్యా అట్టా అనేశావ్‌... ఈ మాటే ఇప్పడు అధికార పార్టీ నేతల్లో హల్ చల్ చేస్తోంది. రాజకీయాల్లో వాస్తవాలు ఒప్పుకోవటం అంటే ఇలా కూడ మాట్లాడాలా అంటూ ఎదురు సెటైర్లు వేస్తున్నారు..

ఆసక్తిగా మారిన అంబటి కామెంట్స్...
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిత్యం వార్తలో ఉంటారు. ఆయన చేసే కామెంట్స్, హావ భావాలు, ప్రతిపక్షాలపై ఎదరు దాడి చేసేందుకు ఉపయోగించే పదజాలంతో అట్రాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల విషయంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌ల నిర్వాహణను గాలికి వదిలేసిందని, కనీసం నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ హాయాంలో జరిగిన నిధుల కేటాయింపు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ళ కాలంలో జరిగిన కేటాయింపులను లెక్కలతో  చంద్రబాబు వివరించారు. 

చంద్రబాబు లెక్కలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ ఆ లెక్కలు కరెక్టే అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు నిదులు కేటాయించలేదని, ఇకపై రాబోయే రోజుల్లో ప్రాజెక్ట్‌లకు అవసరమైన నిధులను కేటాయించి వాటి సంరక్షణ బాధ్యలు చూసుకుంటామని అన్నారు.

పార్టీలో చర్చ...
ప్రతిపక్షాలపై మాటలతో ఎదురు దాడి చేసే మంత్రి అంబటి రాంబాబు, తన శాఖ విషయానికి వచ్చేసరికి, అవును నిజమే ఇకపై చూసుకుంటాం అంటూ మాట్లాడటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంబటి అలా అనేశారు.. అని కొందరు అంటుంటే, అలా ఎలా మాట్లాడారు మంత్రిగారు అంటూ మరి కొందరు ఆయన ముందే నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీని పై ఆయన కూడ నవ్వేసి ఊరుకుంటున్నారు. 

లెక్కలతోనే చెబుతా....
అయితే ఈ వ్యవహరంపై మంత్రి కూడా చాలా క్లారిటిగా ఉన్నారని అంటున్నారు. తాను ఇరిగేషన్ బాధ్యతలను చేపట్టి కేవలం సంవత్సర కాలం మాత్రమే పూర్తయ్యింది. ఈ ఎడాది కాలంలో తాను మంత్రిగా చేసిన కార్యక్రమాల వివరాల పై కూడా లెక్కలు తీసుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటుందని తన సన్నిహితుల వద్ద అంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన వివరాలను ప్రస్తావించినప్పుడు తాను అధికారుల వద్ద సదరు వివరాలను తీసుకోవాల్సి ఉంది కదా అని కూడా మంత్రి చెబుతున్నారని అంటున్నారు. 

రాజకీయాల్లో ఎగిరే వ్యక్తి సొంత శాఖపై ఇలా...
సాధారణ రాజకీయాల విషయాల్లో మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలపై ఎదరు దాడి చేస్తుంటారు. ప్రతిపక్ష నాయకులు ఏదైనా విమర్శ చేస్తే, వాటిని గంటల వ్యవధిలోనే కౌంటర్ ఇచ్చే విషయంలో అంబటి రాంబాబు ముందుండే వ్యక్తి. వాస్తవానికి అదే దూకుడుతో ఆయన రెండోవిడత మంత్రి వర్గంలో జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా అర్హత లభించిందని చెబుతారు. మరి అలాంటి వ్యక్తి తనకు కేటాయించిన శాఖపై ప్రతిపక్షాలు లెక్కలతో సహా విమర్శలు చేస్తే, అవును అంతే గా నేనొచ్చి ఎడాది కాలమే అయ్యిందంటూ సైడయిపోవటంపై కూడా విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Embed widget