(Source: ECI/ABP News/ABP Majha)
YS Jagan R5 zone Houses: ఆర్ 5జోన్ లో ఇళ్ల నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంఖుస్థాపన
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం వ్యవహరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకే రోజు 47వేల ఇళ్ళ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు.
జులై 24న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం వ్యవహరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహరం పై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి మరి ప్రభుత్వం పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ళను కేటాయించింది. ఇప్పటికే లే-అవుట్ లను రెడీ చేసి, అర్హులయిన వారందరికి పట్టాలను కూడe ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఇళ్ళ నిర్మాణానికి జగనన్న కాలనీల పేరుతో శంఖుస్దాపన పర్వానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇళ్ళు పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శంఖుస్థాపన చేయనున్నారు.
పేదలకు ఇళ్ళ నిర్మాణం చేసి తీరుతాం... సజ్జల
సోమవారం R5 జోన్ లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతంలో అమరావతిలో పేదల సొంతింటికల సాకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనే సాధ్యమవుతుందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని సౌకర్యాలతో పేదలకు ప్రైవేటు లే అవుట్ తరహాలో రాజీపడకుండా ఇళ్ళు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇళ్ళ నిర్మాణంతో పేదలకు 10 వేల కోట్ల సంపద ఏర్పడబోతోందని అన్నారు. ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఒప్పుకోకపోయినా మొత్తం భారం భరించడానికి సిధ్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో సేకరించిన భూమిలో 5 శాతం ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందన్నారు. పేదలు అమరావతిలో ఉండకూడదని, కేవలం సంపన్న వర్గాలే ఉండాలన్నది, గత చంద్రబాబు ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు.
రైతుల ముసుగులో రాజధాని ప్రాంతంలో భూములు కొన్నది తెలుగు దేశం నేతలేనని సజ్జల ఆరోపించారు. టిడిపి నేతలే కోర్టులో కేసులు వేయించి ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు లాయర్లకు ఫీజులు చెల్లిస్తూ రైతుల ముసుగులో భూములు సొంతం చేసుకున్న రియల్ వ్యాపారులు కోర్టులలో కేసులు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ఏజన్సీలకు లేఖలు రాస్తున్నారని అన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదనే కుట్రలు చంద్రబాబు ద్వారా కొనసాగుతూనే ఉంటాయన్నారు. కోర్టులో కేసులు లేకపోతే చాలా త్వరగా ఇంటిని ర్మాణాలు పూర్తవుతాయని అన్నారు. అమరావతిలో అభివృధ్ది పనులను కూడా కోర్టు కేసుల ద్వారా వారే అడ్డుకుంటున్నారని లేదంటే శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధి చెంది ఉండేదన్నారు.
రాజధాని ప్రాంతానికి హెలికాప్టర్ లో సీఎం..
అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో బయలుదేరి శంఖుస్దాపన, కార్యక్రమానికి హజరు కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుండి ముఖ్యమంత్రి స్పెషల్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతానికి రావటం చర్చనీయాశంగా మారింది. తాడేపల్లిలోని నివాసం నుండి రాజధాని ప్రాంతానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరానికి సీఎం హెలికాప్టర్ వినియోగించటం పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో భారీ కార్యక్రమం జరుగుతుందని, ఒకే సారి 47 వేళ్ళ ఇళ్ళ నిర్మాణానికి భారీగా లబ్దిదారులు వస్తుండటంతో వారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయిని అధికారులు అంటున్నారు. అటు వీవీఐసీ సెక్యూరిటిలో సీఎం కు రహదారిని క్లియర్ చేయటం ఇబ్బందిగా మారే పరిస్దితి ఉండటంతో హెలికాఫ్టర్ ద్వార రాకపోకలకు ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.