అన్వేషించండి

Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలుపై బిగ్ అప్‌డేట్- ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు- ఇంతకీ ఏమేమీ కావాలంటే?

Student Kits And Talliki Vandanam: ఏపీ ప్రజలు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న పథకం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.

Andhra Pradesh : తల్లికి వందనం, స్టూడెంట్ కిట్స్‌ పథకాలకు ఆధార్‌తోపాటు ఈ పది డాక్యమెంట్స్‌ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న రాత్రి విద్యాశాక కార్యదర్శి కోన శశిధర్ పేరుతో ఆదేశాలను వెలువరించింది.  

తెలుగు దేశం ప్రభుత్వం ప్లాగ్‌షిప్ ప్రొగ్రాం తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. ప్రతి విద్యార్థి తల్లికి ఏటా 15 వేలు ఇచ్చే ఈ పథకం త్వరలోనే అమలుకు నోచుకోనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖాధికారులను విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఆదేశించారు. విద్యార్థి తల్లుల ఆధార్‌ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. 

Also Read: ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసే గడువు పెంపు, మరో 3 నెలలు ఛాన్స్‌

చదువుకునే విద్యార్థి తల్లికి అకౌంట్లో ఏటా పదిహేను వేలు వేస్తామని ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపు చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పటికే స్కూల్‌లు ప్రారంభమయ్యాయి. పథకం అమలు ఎప్పుడు అవుతుందనే ప్రశ్న అందరిలో వినిపిస్తోంది. అందుకే విధివిధానాలు రూపొందించి త్వరలోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముందు ఆధార్‌ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేయనున్నారు. 

Also Read: ఇల్లు మారారా? ఆధార్‌లో అడ్రస్‌ మార్చుకోండి, పూర్తి ఉచితంగా!

తల్లికి వందనం పథకంతోపాటు స్టూడెంట్ కిట్స్‌ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులని తేల్చారు. విద్యార్థి ఏటా 75 శాతం హాజరు ఉంటేనే వాళ్లకు తల్లికి వందనం వస్తుందని స్పష్టం చేశారు. ఆధార్‌తోపాటు బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు, లేదా ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్‌ ఇలా పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని అధికారులు వివరించారు. 

ఆధార్ లేకపోతే...

స్టూడెంట్‌ కిట్‌, తల్లికి వందనం పథకాలకు ఆధార్ ఉన్న తల్లులే అర్హులని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆధార్‌ లేకపోయినా ఆధార్‌కు అప్లై చేసుకున్న సర్టిఫికేట్‌ అయినా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ రెండూ లేకపోతే విద్యాశాఖాధికారులే ప్రత్యేక చర్యలు తీసుకొని ఆధార్‌ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం. 

అవసరమైన గుర్తింపుకార్డులు 

ఆధార్‌ లేని వాళ్లకి కూడ ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. ఆధార్‌ వచ్చే వరకు ఈ కింది పది ఐడీ కార్డుల్లో దేనినైనా చూపించి పథకానికి అర్హత సాధించవచ్చు. పథకం కోసం కావాల్సిన పది ఐడీ కార్డులు 
1. డ్రైవింగ్ లైసెన్స్
2. బ్యాంక్‌ పాస్‌బుక్
3.పాస్‌పోర్టు
4. పాన్ కార్డు
5. ఓటర్ ఐడీ 
6. ఉపాథి పథకం కార్డు 
7. కిసాన్ పాస్‌ బుక్
8. రేషన్ కార్డు 
9. తపాలా పాస్‌బుక్
10. గెజిడెట్‌ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం 
ఇలా ఈ పదిలో ఏది ఉన్నా సరే ఆధార్ వచ్చే వరకు రెండు పథకాల అర్హులను గుర్తించేందుకు తాత్కాలికంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆధార్ ఉన్న వాళ్లు కూడా ఈ పది గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించాల్సి ఉంటుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget