అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ స్కిల్‌ సెన్సెస్‌లో మరో కీలక ముందడుగు- ప్రత్యేక యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం

Skill Census: సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన స్కిల్ సెన్సెస్‌ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీని కోసం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. పరిశ్రమలకు ప్రజలకు అనుసంధానం చేయనుంది.

Skill Census: స్కిల్‌ సెన్సెస్ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... వినూత్నంగా చేయాలని నిర్ణయించింది. కేవలం చదువుకున్న వారి వివరాలే కాకుండా అందరిలో ఉన్న స్కిల్‌ను వెలికితీసే దిశగా చర్యలు తీసుకుంటోంది. 15ఏళ్ల నుంచి దాదాపు అరవై ఏళ్ల వరకు వయసున్న వారి స్కిల్స్‌ను గుర్తించేందుకు ఈ గణన ఉపయోగపపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఇష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది ప్రభుత్వం. 

స్కిల్‌ గణనలో అందరి వివరాలు 

స్కిల్ గణన కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ప్రజల నైపుణ్యాలు, వారు ఇంకా ఏ రంగంలో రాణించాలనే ఆలోచనలో ఉన్నారో తెలుసుకోనుంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి వివరాలే కాకుండా వ్యవసాయం సహా ఇతర చేతి వృత్తుల వారిని కూడా ఈ విభాగంలోకి తీసుకురానుంది. ఇలా చేయడం వల్ల ఏ రంగంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తెలియనుంది. వారికి ఉన్న ఆసక్తి  తెలుసుకొని వారికిని ట్రైనింగ్‌ ఇవ్వడం అందులో లేటెస్ట్ విధానాలు వివరించగలుగుతామని ప్రభుత్వం ఆలోచన. 

ఉపాధి కల్పించేందుకు వీలుగా..

ఈ యాప్‌ ద్వారా ప్రజల వృత్తి నైపుణ్యాలను అంచనా వేయడం ద్వారా వారికి ఉన్న ఆసక్తితోపాటు వారి నైపుణ్యాలు మెరుగుపరిచే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వారి స్థాయిని కూడా వర్గీకరించే వీలు ఉంటుందంటున్నారు. దీనికి అనుగుణంగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సులభమవుతుందని అంటున్నారు. 

ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు 

ప్రభుత్వం తీసుకొచ్చే యాప్‌లో ఎక్కడి నుంచైనా లాగిన్ కావచ్చు. ఫోన్‌ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ద్వారా లాగిన్ కావచ్చు. అందులో వ్యక్తిగత వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరి ఏపీకి చెందిన వారైతే చాలు ఈ యాప్‌లో తమ వివరాలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విధానంలో కూడా వివరాలు ఇందులో పొందుపరిస్తారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్కరు ఇరవై మంది వివరాలును సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read: AP Capital అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు పరిశీలిస్తున్న ఐఐటీ నిపుణులు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక

పరిశ్రమలతో అటాచ్ చేసేలా ప్లాన్

ఈ స్కిల్ సెన్సెస్‌ తర్వాత మరో అడుగు ముందుకు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్‌నకు పరిశ్రమలను అటాచ్ చేయనుంది. అంటే తమ రాష్ట్రంలో ఈఈ నైపుణ్యాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారని వారికి తెలియజేసి వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేలా చేయడం రెండో లక్ష్యం. అటుప్రజలకు ఇటు పరిశ్రమలకు మధ్య గ్యాప్‌ను తగ్గించి నిరుద్యోగతను తగ్గించాలని భావిస్తోంది.  

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే తొలిసారి ఐదు సంతకాలు చేశారు. అందులో ఈ స్కిల గణన కూడా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యాలను గుర్తించి దానికి అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 

Also Read: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రెడీ - మరి ఏపీ పరిస్థితి ఏంటి ?

టాప్ హెడ్ లైన్స్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
CM Chandrababu: చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget