అన్వేషించండి

Nara Lokesh: పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నారా లోకేష్ ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నారు. నేరుగా ప్రచారం చేసుకోవడం కాకుండా.. తన పని తీరే తనకు ప్రచతారం అన్నట్లుగా లోకేష్ పనితీరు ఆకట్టుకుంటోంది.

Nara Lokesh making his mark Education Department:  రాజకీయాల్లో ఏ చిన్న పని చేసినా భారీ హోర్డింగ్‌లు, పత్రికల్లో సొంత డబ్బా కొట్టుకునే ఫోటోలతో ప్రచారం చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. తన ఫోటోలు ప్రదర్శించుకోవడం కంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థ సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.  పదో తరగతి ఫలితాల సందర్భంగా పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల్లో మంత్రి ఫోటో ఎక్కడా కనిపించలేదు.  కేవలం మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, వారి ప్రతిభను మాత్రమే హైలైట్ చేయడం ద్వారా  క్రెడిట్  అంతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకే ఇస్తున్నారనే సంకేతాలను ఆయన బలంగా పంపారు.

విద్యాశాఖలో పలు సంస్కరణలు

నారా లోకేష్ విధానంలో  వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం  అనే సూత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పదో తరగతి ఫలితాల విడుదల సమయంలోనూ ఎటువంటి ఆర్భాటం లేకుండా, కేవలం విద్యాశాఖ పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు రావడానికి కారణమైన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ  , స్లిప్ టెస్టులు, లీప్ మొబైల్ యాప్ వంటి సాంకేతిక సంస్కరణలపై ఆయన దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం తన వ్యక్తిగత విజయం కంటే, విద్యాశాఖలో వస్తున్న మార్పుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. 

నిడమర్రు పాఠశాల ఓ మోడల్ 

నిడమర్రు లో నిర్మించిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మోడల్ స్కూల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు  15 కోట్ల వ్యయంతో, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులు,  క్రీడా ప్రాంగణాలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. కేవలం ఒక స్కూల్ కట్టి వదిలేయకుండా, ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సౌకర్యాలను ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తేవాలన్నది ఆయన లక్ష్యం. ఈ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లోకేష్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఉపాధ్యాయుల సమస్యలు లేకుండా నియామకాలు

ఉపాధ్యాయుల నియామకాలు లేదా బదిలీల వంటి సున్నితమైన అంశాల్లో కూడా వివాదాలకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నారు. గత పాలకుల విధానాల వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో.. ఉపాధ్యాయులలో జవాబుదారీతనాన్ని పెంచుతూనే, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. సంస్కరణలు అనేవి కేవలం కాగితాల మీద కాకుండా, తరగతి గదిలో మార్పు తెచ్చేలా ఉండాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

విద్యాశాఖలో నో ఫోటో, నో పాలిటిక్స్ పాలసీ

లోకేష్ అనుసరిస్తున్న ఈ 'నో-ఫోటో' ప్రచార వ్యూహం విద్యావంతుల్లో మరియు సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. తన గురించి తాను చెప్పుకోవడం కంటే, తన పనిని ప్రజలే గుర్తించేలా చేయడం ద్వారా ఆయన రాజకీయంగా మరింత పరిణతిని చాటుకుంటున్నారు. ప్రచార ఆర్భాటం లేని ఈ పనితీరు, అంతిమంగా ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.  ప్రతిభకు గుర్తింపు - వ్యవస్థకు గౌరవం  అనే నినాదంతో లోకేష్ సాగిస్తున్న ఈ ప్రయాణం ఏపీ విద్యా రంగంలో ఒక మైలురాయిగా ఉంటుందన్న అంచనాలు ప్రజల నుంచి వస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget