అన్వేషించండి

Andhra Labor Adda: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన

Labor Adda: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక లేబర్ అడ్డా లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Andhra Labor Adda CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్మికుల పాత్రను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. మే డేను పురస్కరించుకుని శ్రమశక్తి పురస్కారాలు అందించారు.  

ఈ లేబర్ అడ్డాలు కేవలం కార్మికులు వేచి చూసే కేంద్రాలు మాత్రమే కాకుండా, పని లేని రోజుల్లో వారి నైపుణ్యాన్ని పెంచే  స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు గా మారుతాయని ఆయన స్పష్టం చేశారు. తొలి దశలో అమరావతితో సహా 15 ప్రధాన నగరాల్లో వీటిని నిర్మిస్తామని, కార్మికులకు అత్యాధునిక పనిముట్లతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పునర్ వైభవం తెచ్చే క్రమంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కాలపరిమితిని విధించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కృష్ణా జిల్లా ముఖచిత్రాన్ని మార్చే  బందరు పోర్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే, బీచ్ రోడ్డు విస్తరణ వంటి పనుల ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం, వైసీపీని  గొడ్డలి పార్టీ గా అభివర్ణించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేసిన సంస్కృతి వారిదని, కానీ తమ కూటమి ప్రభుత్వం విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మిస్తోందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తూ, సంక్షేమం కోసం ప్రతీ నెలా రూ.2,721 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తోందని, ప్రజల సహకారమే తమకు శ్రీరామరక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.

విద్యా మరియు పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వచ్చిన మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ప్రశంసించారు. కార్మికుల పిల్లలు కూడా రేపు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని చెబుతూ, శ్రమశక్తి పురస్కారాలను అందజేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని చెప్పడం ద్వారా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా సీఎం గట్టి సంకేతాలిచ్చారు.                    

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Pawan Kalyan Names New Plant: తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి - క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్‌గా పేరు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget