అన్వేషించండి

Ambati Rambabu granted bail: అంబటి రాంబాబుకు బెయిల్ - జైలు నుంచి బయటకు రావడం ఖాయమే !

Ambati Rambabu : అంబటి రాంబాబుకు మరో కేసులోనూ బెయిల్ వచ్చింది . మరే పీటీ వారెంట్ పెండింగ్ లో లేకపోవడంతో ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Ambati Rambabu gets bail:  మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో ఆయనను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు చట్టపరంగా మార్గం సుగమమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై నమోదైన ప్రధాన కేసులో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. అయితే, ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి నోటీసులు  జారీ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో తక్షణ అరెస్టు ముప్పు తప్పినట్లయింది.

ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై ఇతర ఏ కేసుల్లోనూ పీటీ  వారెంట్లు పెండింగ్‌లో లేవు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, జైలు నుంచి ఆయన విడుదల కావడానికి ఉన్న అన్ని సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన వెంటనే అధికారిక ప్రక్రియ పూర్తి చేసి, ఆయనను విడుదల చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును  జనవరి 31న పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు గుంటూరులోని ఆయన నివాసం వద్ద  వైసీపీ, టీడీపీ  కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, భారీ బందోబస్తు మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఫిబ్రవరి 2న గుంటూరు మొబైల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
 
తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.  విచారణ జరిపిన  గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు  కోర్టు ఫిబ్రవరి 9న సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తూ ఆయనకు ఊరటనిచ్చింది. అయితే, అదే రోజున వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో జరిగిన నిరసనలకు సంబంధించిన మరో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో, తొలి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలులోనే కొనసాగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కేసులోనూ బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.   

అయితే  చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉండటంతో ఆయన భద్రత సవాల్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పరిచేటప్పుడు.. గార్డుల్ని అడ్డం పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బెయిల్ రావడంతో ఆయనకు అలాంటి సెక్యూరిటీ లభించదు.                            

 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
YSRCP North Andhra Crisis: ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget