అన్వేషించండి

AP Assembly Schedule: ఈ 14న సభలో రాష్ట్ర బడ్జెట్‌, మొత్తం 17 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session 2026 | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ 14న ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 7 వరకు 17 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి.

AP speaker Ayyanna Patrudu | అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు (ఫిబ్రవరి 12) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 7 వరకు 17 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటే, అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మొత్తం పదిహేడు రోజుల పాటు శాసనసభ కార్యకలాపాలు సాగనున్నాయి.

 ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని, పండుగ మరుసటి రోజైన 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. తిరిగి ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు సభ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో వీకెండ్ సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ఈ సమావేశాల అజెండాను రూపొందించారు. 

ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై, ఇతర ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతాయి. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో సభకు విరామం ఉంటుంది. మార్చి 2 నుంచి 7 వరకు చివరి విడత సమావేశాలు నిర్వహిస్తారు. ఈ విడతలో భాగంగా మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసెంబ్లీలో నిరసనకు దిగి సభ నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను విమర్శించడం, వ్యవస్థల నిర్వీర్యం గురించి ప్రస్తావించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగంలా ఉందని ఆరోపిస్తూ సభ మధ్యలోనే నిష్క్రమించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దని, తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించి జగన్ కు ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ వెలుపల వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గవర్నర్ నోట అబద్ధాలు చెప్పిస్తోందని నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే గత పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా ఈ ప్రసంగిస్తున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజకీయాలకు అసెంబ్లీని కేంద్రంగా వాడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
AP MPTC ZPTC Election Results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Embed widget