అన్వేషించండి

Maoist Letters To AP Ministers: నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

Kandula Durgesh on Maoists Letter | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు లేఖలు కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ ప్రారంభించాయి. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ బెదిరింపు లేఖల వార్త చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

మావోయిస్టు లేఖలపై మంత్రి కందుల అనుమానాలు..

మావోయిస్టుల లేఖ అంశంపై మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్‌చాట్ సందర్భంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిర్వహిస్తున్నది పర్యాటక శాఖ వంటి చిన్న శాఖ అని, తనకు మావోయిస్టులు లేఖలు రాయాల్సినంత పెద్ద వివాదాలు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగతంగా గానీ, శాఖాపరంగా గానీ తాము ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదని కందుల స్పష్టం చేశారు. సాధారణంగా మావోయిస్టుల నుంచి వచ్చే లేఖల శైలి ఇలా ఉండదని, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లేఖలు సృష్టించి ఉంటారని మంత్రి అభిప్రాయపడ్డారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటెలిజెన్స్ విభాగం

ఈ బెదిరింపుల లేఖలపై మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ లేఖ వెనుక ఉన్న కుట్రను, అసలు కారకులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తుతెలియని వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చిన కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

నేటి ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ సహా పలు రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుందన్నారు. మహిళల ప్రగతి కోసం, వారి అభివృద్ధికి ప్రత్యేక పథకాలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారిందన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను ఏపీ ప్రభుత్వం కొనసాగించడంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ద్వారా క్లీన్ ఎనర్జీపై ఫోకస్ చేసిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget