Nara Lokesh : అధర్మం అంతర్జాతీయ కోర్టుకెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే - నారా లోకేశ్
Nara Lokesh : రాజధానిపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై లోకేశ్ స్పందించారు.
Nara Lokesh : అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమ విజయం న్యాయానిదే అని ట్వీట్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై లోకేశ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే.
— Lokesh Nara (@naralokesh) September 17, 2022
క్రీడాకారులకు ఆర్థిక భరోసా ఏది?
"ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉందని సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో చెప్పారు. అటువంటప్పుడు రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్ లో పాల్గొంటున్న సుమారు 300 మంది క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్లకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు. నేషనల్ గేమ్స్ కు వెళ్తుంటే క్రీడాకారులకు కనీసం ఒక్కరోజు శిక్షణ కూడా ఇవ్వలేదని, గుజరాత్ వెళ్లేందుకు క్రీడాకారుల ప్రయాణానికి రిజర్వేషన్లు కూడా చేయించలేదని అంటున్నారు. దొంగాటలు, దోపిడీ ఆటలు, బూతు గేమ్స్, మీరు ఆడుకునే పబ్జీ గేమ్ తప్ప మీ దృష్టిలో మిగతా క్రీడలకు విలువ లేదా? ఎలాగూ మీరు, మీవాళ్లు ఏపీ పరువు తీస్తున్నారు. కనీసం క్రీడాకారులను ప్రోత్సహిస్తే వారన్నా పోయిన పరువు కాపాడి తెచ్చే వీలుంది కదా! కాబట్టి వెంటనే వారికి నిధులు మంజూరు చేసి వాళ్లంతా ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పోరాడేలా ప్రోత్సహించండి." - నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉందని జగన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పారు. అటువంటప్పుడు రాష్ట్రం నుండి నేషనల్ గేమ్స్ లో పాల్గొంటున్న సుమారు 300 మంది క్రీడాకారులు, కోచ్ లు & మేనేజర్లకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్ రెడ్డి? pic.twitter.com/DPWR6Fl8Sn
— Lokesh Nara (@naralokesh) September 17, 2022
సుప్రీంకోర్టులో పిటిషన్
అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మార్చి మూడో తేదీన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను ఇచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. హైకోర్టు మూడు రాజధానులు, పాటు సీఆర్డీఏ చట్టం పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Also Read : GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !