Amaravati Farmers Protest: అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు.. ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టుల పర్వం
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600వ రోజు అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు.

Background
అమరావతి రైతుల ఉద్యమం 600వ రోజుకు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయడంతో రైతులు తమ పోరాటాన్ని మొదలుపెట్టారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని, తమకు ఏకైక రాజధానే పరిష్కార మార్గమని రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ స్థాయి వరకు తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా.. వెనుకడుగు వేయకుండా రైతులు ముందుకు సాగుతున్నారు. నేటి ఉదయం నుంచి రాజధాని ప్రాంతానికి రైతులు, యువకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
మందడంలో మళ్లీ ఉద్రిక్తత
మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు వైపు వెళ్లేందుకు అమరావతి రైతులు, మహిళలు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన చేశారు. మందడం రహదారిపై బైఠాయించి మహిళల నిరసన చేపట్టారు.
టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొనకళ్ల గృహ నిర్బంధం
అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొంటారన్న సమాచారంతో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనకళ్ల నారాయణను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళగిరిలో అమరావతి ఉద్యమ రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం వద్దకు చేరుకున్న రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.





















