News
News
X

CM Jagan Review : అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోవాలి-సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : హాస్టళ్లలో మూడు దశల్లో నాడు-నేడు పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీ, హాస్టళ్లలో సిబ్బందిని భర్తీ చేయాలన్నారు.

FOLLOW US: 

CM Jagan Review : రాష్ట్ర వ్యాప్తంగా రూ.3364 కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడు పనులు చేపడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరణ చేపడుతున్నామని తెలిపారు. మొదటి విడత హాస్టళ్ల కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తున్నామని, జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిపై అధికారులు సీఎంకు నివేదిక అందించారు. అంగన్‌వాడీలలో సూపర్‌ వైజర్ల పోస్టులను భర్తీ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను గురించి కూడా అధికారులు నివేదికను అందించారు. మూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని అంగన్‌ వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. 

అంగన్‌వాడీలలో నాడు-నేడు కార్యక్రమం  

అంగన్వాడీలలో నాడు-నేడు పనులు, నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్‌వాడీలలో ఉండాలని జగన్ ఆదేశించారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అన్నారు.

గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో 

News Reels

మొత్తం మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలన్నారు. పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. హాస్టళ్లకు వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదన్నారు. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారని, వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని జగన్ ఆకాంక్షించారు. సమాజంలో  అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదన్నారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్‌ బెడ్స్‌, తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలన్నారు. భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని, గురుకుల పాఠశాలలు,హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు-నేడు పనులు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు-నేడు పనులు చేపట్టాలని, దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశించారు.

రూ.3364 కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడు  

మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు-నేడు కోసం ఖర్చు అవుతుందని సీఎం తెలిపారు. తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని, కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్‌ కొనుగోలు చేయాలన్నారు. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని, పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం సూచించారు. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలని,మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్నారు. హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని, ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీచేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన సీఎం జగన్, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌ –4 ఉద్యోగుల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. 

Published at : 18 Nov 2022 07:39 PM (IST) Tags: Nadu Nedu CM Jagan Amaravati Anganwadi Gurukuala schools

సంబంధిత కథనాలు

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

AB Venkateshwar Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు షాక్, ఏమైందంటే?

AB Venkateshwar Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు షాక్, ఏమైందంటే?

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?