News
News
X

CM Jagan : ఆక్వా ధరల పతనంపై సీఎం జగన్ సీరియస్, సిండికేట్‌ వ్యాపారులకు వార్నింగ్!

CM Jagan : ఆక్వా ధరల పతనం, ఫీడ్ ధరలపై వస్తున్న ఫిర్యాదుపై సీఎం జగన్ సమీక్షంచారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

FOLLOW US: 

CM Jagan : ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై ముఖ్యమంత్రికి రైతులు, రైతు సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదుల పై స్పందించిన సీఎం... ముగ్గురు మంత్రులు, సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు చేయ‌టంతో జ‌గ‌న్ వెంట‌నే స‌మీక్ష నిర్వహించారు. ధరలు పతనమై నష్టపోతున్నామన్న రైతులు, ఆక్వాఫీడ్‌ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. తన దష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని సీఎం అన్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. కమిటీలో విద్యుత్‌, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, స్పెషల్‌ సీఎస్‌లు విజయానంద్, పూనం మాలకొండయ్య, మత్సశాఖ కమిషనర్‌ కన్నబాబు ఉన్నారు. 

ఆక్వా కల్చర్ చట్టం 

ఆక్వా కల్చర్‌లో 60 శాతం నిర్వహణ వ్యయం కేవలం ఫీడ్‌ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెల‌కొంది. ప్రస్తుతం ఈ ఫీడ్‌కు సంబంధించిన నాణ్యత ఇతర అంశాల పర్యవేక్షణ కోసం ఎలాంటి నియంత్రణ వ్యవస్ధ దేశంలో మరెక్కడా లేదు. ఫిష్‌ ఫీడ్‌కు సంబంధించి అధిక ధరలు, సిండికేట్‌ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్యపరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌ – 2020 ఆక్వా రైతులకు అండగా ఉంటుందని భావించింది. ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌ 2020ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. 

కల్తీ సీడ్ నియంత్రణకు చర్యలు 

News Reels

ఈ చట్టాలు ద్వారా ఆక్వా కల్చర్‌ రంగలో నాణ్యమైన సీడ్‌ అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అడుగులు పడతాయని భావించింది ప్రభుత్వం. కల్తీ సీడ్‌ని నియంత్రించడం ద్వారా వ్యాధుల బారిన పడని, పెరుగుదల లేని రకాలను నియంత్రణతో పాటు మంచి దిగుబడినిచ్చే సీడ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంది. ఇది ఆక్వా కల్చర్‌ రంగానికి వెన్నుముక అయిన రైతుకు అండగా నిలుస్తుందని అభిప్రాయపడింది.  ఈ యాక్ట్‌ ద్వారా ఆక్వారంగంలో అనైతిక విధానాలకు అడ్డుకట్టు వేయడంతోపాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు అవకాశం కలిగిస్తుందని కూడా అధికారులు తెలిపారు. కానీ వారి అంచనాలు తారుమారు చేస్తూ వ్యాపారులు సిండికేట్‌గా మారడం రైతులు నష్టపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు 

మత్స్యపరిశ్రమ, ఆక్వాకల్చర్‌ సమగ్రాభివృద్ధి కోసం నిపుణుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడనుంది ప్రకటించింది. రాష్ట్రంలోని ఆక్వాకల్చర్‌కు సంబంధించిన కార్యకలాపాలును ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ ఆక్వాకల్చర్‌ ఉత్పత్తుల నాణ్యత, ధరలతోపాటు సీడ్, ఫీడ్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది. కోవిడ్‌ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల నుంచి నిషేధం కారణంగా... ధరలు గణనీయంగా పడిపోవడంతోపాటు రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది.అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతలగిడ్డంగులను, ప్రాసెసింగ్‌ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతోపాటు రైతుల ఉత్పత్తులను తగిన ధరలను కూడా నిర్ణయించింది. 

ఆక్వారైతుల సంక్షేమం కోసం 

ఆక్వా రైతుల ఉత్పాదయ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతోపాటు యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ కూడా ఇస్తోంది. గతంలో 2016లో ఆక్వా రైతులకు పవర్‌ టారిఫ్‌ యూనిట్‌ రూ.4.63 నుంచి రూ.7  కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్‌ రూ.3.86 పైసలకు సరఫరా చేసింది. జూన్‌ 2108 నుంచి జూన్‌ 2019 వరకు రూ.2 కే యూనిట్‌ సరఫరా చేయగా... జూలైలో ప్రభుత్వం యూనిట్‌ రూ.1.50 కే అందిస్తూ ఉత్తర్వులుజారీ చేసింది. 

రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం వాటా 
 
ఆక్వాకల్చర్‌ సాగులో దేశంలోనే అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సుమారు 2 లక్షల హెక్టార్ల ఆక్వాసాగులో 1.10 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు, 429 రొయ్యల హేచరీస్, 102 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 107 శీతల గిడ్డంగులు, 37 ఫీడ్‌ ప్లాంట్లు, 225 ఆక్వా ల్యాబులు, 1014 ఆక్వా షాపులు ఉన్నాయి. ఏపీలో ఏడాదికి సుమారు 60వేల మిలియన్‌ల ఉత్పత్తితో ఆక్వా హబ్‌గా ఏపీ నిల‌బ‌డింది. దేశంలోనే 30 శాతానికిపైగా వాటాతో రొయ్యలు, చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా నిల్చింది ఏపీ. ఆక్వా కల్చర్‌ ద్వారా రాష్ట్రంలో సుమారు 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న రొయ్యలలో 78 శాతం ఏపీ వాటా ఉంది.  దేశవ్యాప్తంగా 10.17 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా కేవలం ఏపీలోనే 7.89 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిషాతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు ఏటా దాదాపు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపలు ఎపీ నుంచి  సరఫరా అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం అక్వారంగంపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. ఏ చిన్న అలసత్వం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు సీఎం జగన్

Published at : 08 Oct 2022 06:22 PM (IST) Tags: AP News CM Jagan Amaravati Aqua sector Prawns rate

సంబంధిత కథనాలు

MP Vijayasai Reddy :  త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

Ganta In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

Ganta In YSRCP :  వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

NTR District News : కరెంట్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్న సర్పంచ్

NTR District News :  కరెంట్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్న సర్పంచ్

టాప్ స్టోరీస్

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !