Amalapuram News : కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన కోనసీమ కుర్రాడు, బ్యాడ్మింటన్ లో రెండు పతకాలు సాధించిన సాత్విక్
Amalapuram News : కామన్వెల్త్ క్రీడల్లో అమలాపురం కుర్రాడు అదరగొట్టాడు. బ్యాడ్మింటన్ డబుల్స్ లో స్వర్ణ పతకం సాధించగా, టీమ్ ఈవెంట్ లో రజతం సాధించాడు.
Amalapuram News : కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగు తేజాలు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ లో పీవీ సింధు స్వర్ణం గెలుచుకోగా, బాక్సింగ్ లో నిఖత్ జరీన్ గోల్డ్ సాధించింది. వీరితో పాటు అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు గోల్డ్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి హిట్ జోడీ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లాండ్ కు చెందిన లేన్, వెండీ జోడీపై వరుస సెట్లలో విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకున్నారు. సాయిరాజ్ స్వస్థలం అమలాపురం కాగా సాత్విక్ కు గోల్డ్ మెడల్ రావడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
అమలాపురం కుర్రాడు
అమలాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో చిరాగ్‌శెట్టితో కలిసి ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించాడు. కామన్‌వెల్త్ డబుల్స్ వ్యక్తిగత విభాగంలో తొలిసారి గోల్డ్ సాధించాడు సాత్విక్. అయితే ఇప్పటికే టీమ్ ఈవెంట్‌లో సాత్విక్ రజతం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా డబుల్ గోల్డ్ కొట్టాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో కూడా సాత్విక్ గోల్డ్, సిల్వర్ పతకాలు గెలుచుకున్నాడు. అప్పుడు టీమ్ ఈవెంట్‌లో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో సిల్వర్ పతకాలు సాధించాడు సాత్విక్ సాయిరాజ్.
Thankyou so much sir for continous support. https://t.co/Knt7NEFTGa
— Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) August 9, 2022
మూడు నెలల్లో మూడు పతకాలు
సాత్విక్ సాయిరాజ్ గడచిన మూడు నెలల్లో అనూహ్య విజయాలు సాధించాడు. మే నెలలో ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో సాత్విక్ ఆడాడు. థామస్ కప్ చరిత్రలోనే భారత జట్టు సాధించిన గొప్ప విజయంగా ఇది నిలిచిపోతుంది. మూడు నెలల వ్యవధిలోనే కామన్వెల్త్‌లో గోల్డ్, సిల్వర్ సాధించడంతో అంతర్జాతీయ వేదికపై మూడు అత్యుత్తమ పతకాలు సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు సాత్విక్. 2021 జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్‌లో చిరాగ్‌శెట్టితో కలిసి మూడు మ్యాచ్‌లకు ఆడిన సాత్విక్ రెండింట్లో విజయం సాధించాడు. అయితే పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. తన జీవితాశయమైన ఒలింపిక్ పతకాన్ని ఎప్పటికైనా సాధిస్తానని సాత్విక్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్–750లో సాత్విక్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఇండియన్ ఓపెన్–500 సాత్విక్ సాయిరాజ్ విజేతగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ లో సాత్విక్ సాయిరాజ్ విజయాలపై అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సాత్విక్ విజయం సాధించగానే అతడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సాత్విక్ మిత్రులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
(సాత్విక్ తల్లిదండ్రులు)
Also Read : India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!