Andhra News : కోడికత్తి కేసు విచారణ 27కి వాయిదా - బదిలీ అయిన జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం జగన్ పై ఎయిర్ పోర్టు దాడి కేసు 27వ తేదీకి వాయిదా పడింది. కొత్త జడ్జ్ కేసును విచారించనున్నారు.
Andhra News : విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తిదాడి కేసులో తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా వేశారు జడ్జి ఆంజనేయలు. న్యాయాధికారుల బదిలీల్లో భాగంగా జడ్జి ఆంజనేయులు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జడ్జి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ చేస్తున్నందున తనకు కోడికత్తి కేసు జడ్జిగా పేరు వచ్చిందన్నారు. తన లిమిట్స్ తనకు ఉన్నాయని.. చట్ట ప్రకారం వెళ్లాల్సి ఉందన్నారు. ఎవరి మనసు నొప్పించి ఉంటే అంటూ...
రెండు చేతులు ఎత్తి నమస్కరించారు.
ఇరువర్గాలు వాదనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయలని లేదని.. త్వరగా కేసు విచారణ కి పనిచేశానన్నారు. కేసు 27వ తీదేకి వాయిదా వేశారు. వచ్చే వాయిదా నుంచి కొత్త జడ్జి కేసు ను విచారిస్తారని తెలిపారు. ఈ విచారణలో ఎన్ఐఏ వాదనలు వినిపించాల్సి ఉంది. గత విచారణలో బాధితుడు జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరో వైపు తాను కోర్టుకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పైనా వాదనలు జరిగాయి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపున వాదిస్తున్న లాయర్ సలీం తన వాదనలు వినిపించారు.
కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడానికి ట్రాఫిక్ కారణం అని సీఎం జగన్ చెప్పడం సమంజసం కాదన్నారు. వివాహాలు ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు సీఎం హజరుఅవుతున్నప్పుడు కూడ ట్రాఫిక్ స్దంభిస్తోందని అయితే కోర్ట్ కు రావటానికి ఉన్న అభ్యంతరం ఎందుకని కోడికత్తి కేసు న్యాయవాది సలీం ప్రశ్నించారు.కోర్ట్ ముందు జగన్ హజరుకావాల్సిందేనని ఆయన అన్నారు.జగన్ కు మినహాయింపు ఇచ్చే అవకాశం చట్ట ప్రకారం లేదని చెప్పారు. న్యాయమూర్తి బదిలీ కారణంగా కేసు విచారణను 27వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు.
గత విచారణ సందర్భంగా మీడియాతో మాట్లాసిన లాయర్ సలీమ్ రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం.. అక్కడే ఈ కేసు ఆగిపోయిందని లాయర్ అబ్దుల్ సలీమ్ అన్నారు. ఎయిర్ పోర్టు ఆఫీసర్ దినేష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారని, ఇప్పుడు సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలన్నారు. కానీ జగన్ కోర్టుకు రాకుండా పిటిషన్ వేసి గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితుడిపై 307 సెక్షన్ పెట్టకూడదని, ఈ కేసు ఎన్ఐఏకు ఇవ్వడం కూడా వాదిస్తున్నారన్నారు.