Top Headlines: ఏపీలో కూటమి ప్రభుత్వానికి 6 నెలలు - 50 ఏళ్లలో తెలంగాణలో అతి పెద్ద భూకంపం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
4th December Top Headlines In AP And Telangana:
1. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 6 నెలలు
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచి ఈ రోజుకి సరిగ్గా ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల్లో తమది చాలా మంచి ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి ఎక్కువగా సాధించగలుగుతున్న నిధులు, విజయవాడ వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, కూటమిలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లడం వంటి ఎన్నో పాజిటివ్ అంశాలు ఏపీ ప్రభుత్వం వైపు ఉన్నాయి. అందుకే సీయం చంద్రబాబు నాయుడు పదేపదే తమది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇంకా చదవండి.
2. పుష్ప 2 సినిమాకు జనసేన నేత వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 04 అర్థరాత్రి బెనిఫిట్ షోతో సందడి మొదలైపోతుంది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప 2 రిలీజ్ తర్వాత రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో మూవీపై భారీ అంచనాలు పెంచేశారు. టీమ్ మొత్తం రిలీజ్ సందడిలో ఉన్న టైమ్ లో సినిమా విడుదల అడ్డుకుంటాం అంటూ జనసేన నాయకులు హెచ్చరికలు జారీ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇంకా చదవండి.
3. శ్రీకాకుళం జిల్లా రైతుల వినూత్న ప్రయత్నం
శ్రీకాకుళంజిల్లాలో రైతులను ఓవైపు తుపానులు బెదరగొడుతుంటే... మరోవైపు అడవి పందులు అదరగొడుతున్నాయి. పండించిన పంట చేతి వరకు వస్తుందో లేదో అన్న బెంగ వారిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో ఈ ఏడాది 42 వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ప్రధానంగా సోంపేట మండలంలోని పలాసపురం, బారువ, బెంకిలి, బేసిరామచంద్రాపురం, కంచిలి మండలంలోని గొల్లకంచిలి, బూరగాం, శాసనాం, కవిటి మండలంలోని మాణిక్యపురం తదితర గ్రామాల్లో అడవి పందులు బెడద ఎక్కువగా ఉంది. ఇంకా చదవండి.
4. 50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదే
బుధవారం ఉదయం ములుగు జిల్లాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రకంపనల తీవ్రత అధికంగా కనిపించింది. కూర్చున్న చోట చాలా మంది వణికిపోయారు. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల వరకు భూకంప ప్రభావం కనిపించింది. 4 డిసెంబర్ 2024 బుధవారం ఉదయం 7 గంటల 27నిమిషాలకు రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరంగల్ కు ఈశాన్యంగా 85కిలోమీటర్లు, హైదరాబాద్‌కు ఈశాన్యంగా 218, విజయవాడకు ఉత్తరంగా 212 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు National Center for Sesimology తెలిపింది. ఇంకా చదవండి.
5. పన్ను పోటు వార్తలు నమ్మొద్దన్న కేంద్రం
దుస్తులు, గడియారాలు, సిగరెట్లు, పొగాకు, శీతల పానీయాలు సహా 148 వస్తువులపై టాక్స్ రేట్లను పెంచడానికి మంత్రుల బృందం సిఫార్సు చేసిందన్న వార్త అబద్ధమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & ఎక్సైజ్ కస్టమ్స్' (CBIC) ట్వీట్ చేసింది. ఇంకా చదవండి.