Top Headlines: మంత్రికి సీఎం చంద్రబాబు క్లాస్ - తెలంగాణలో చీకటి ఊరు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In Ap And Telangana:
1. మంత్రికి సీఎం చంద్రబాబు క్లాస్
ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోనని తరచూ చెప్పే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌ఛార్జ్ నుంచి మంత్రి వరకు ఎవర్నీ వదలడం లేదు. చెప్పిన పని చెప్పినట్టుగా చేయాల్సిందేనంటూ క్లాస్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఈ మధ్య తెలుగు దేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. దీంతోపాటు పట్టభద్రుల ఓట్ల నమోదు జరుగుతోంది. ఈ రెండింటిపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లతో ఇటీవల చంద్రబాబు టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. అయితే ఈ కాన్ఫిరెన్స్‌లో కొందరి పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చదవండి.
2. ఏపీ టెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం (నవంబరు 4న) ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంకా చదవండి.
3. మాజీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం
151 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ దేశంలో రికార్డు కెక్కింది. నాడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ని చూసి ఓట్లు వేశారు. 5 ఏళ్ల కాలంలో చేసుకున్న స్వయంకృతాపరాధాలతో ఎంత ఎత్తుకు ఎదిగిందో అంత కంటే రెట్టింపు వేగంతో పతనమైంది. 151 సీట్లు నుంచి 11 సీట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత వైసీపీ బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్. పార్టీని నమ్ముకున్న వారికి కీలక పదవులు ఇస్తూ బలోపేతానికి కృషి చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టారు. ఇంకా చదవండి.
4. తెలంగాణలో చీకటి ఊరు
"క" సినిమా చూపించిన క్రిష్ణగిరి గ్రామంలో సాయంత్రం మూడు గంటలకే చీకటి పడుతుంది. ఇలాంటి గ్రామమే తెలంగాణలో కూడా ఉంది. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ప్రజలంతా ఆ సమయానికి ఇంటికి చేరుకుంటారు. ఈ గ్రామంలో సూర్యడు త్వరగా రాడు... త్వరగా అస్తమిస్తాడు.. గుడి ఉంటు కానీ దేవుడు ఉండడు. ఇలాంటివి చెబితే వణుకు పడుతుంది కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం అక్కడకు వెళ్లి ఒకరోజు ఉండి నేరుగా ప్రకృతి విచిత్రాన్ని చూడాలనిపించక మానదు. ఇంకా చదవండి.
5. నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కస్తూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగు వాళ్లు తమిళనాడు వచ్చారని అన్నారు. అలాంటి వాళ్లు తాము కూడా తమిళ జాతి అంటున్నారని కామెంట్స్ చేశారు. ఇది వివాదాస్పదం కావడంతో తాను ఆ ఉద్దేశంతో అనలేదని... తన కామెంట్స్ వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటి, బీజేపీ లీడర్ కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంకా చదవండి.