APTET Results: ఏపీ టెట్-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
TET Results: ఏపీ టెట్ 2024 (జులై) ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మంత్రి లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
APTET July -2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం (నవంబరు 4న) ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాలను https://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 21 వరకు 17 రోజల పాటు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 86.28 శాతం మంది పరీక్ష రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 2న టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన నవంబరు 4కి వాయిదా పడింది. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ వెల్లడైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
పరీక్షలో ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహించగా.. అర్హత మార్కులను ఓసీ(జనరల్) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. ఈ అర్హత మార్కుల ఆధారంగా టెట్ ఫలితాలను అధికారులు రూపొందించారు. ఫలితాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబర్లు: 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286, 9398822618లలో లేదా ఈమెయిల్: grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చు.
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది… pic.twitter.com/7RJmwmtu1Q
— Lokesh Nara (@naralokesh) November 4, 2024
రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్..?
టెట్ ఫలితాలు నవంబరు 4న విడుదల కానుండగా.. ఒకట్రెండు రోజుల్లోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...