అన్వేషించండి

Top Headlines: ఏపీ టీచర్లకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ - ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In Ap And Telangana:

1. ఏపీ టీచర్లకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్

టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీచేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంకా చదవండి.

2. మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా  భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ నేతలు రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర వెళ్తున్నారు. శని, ఆదివారాల్లో పవన్ కల్యాణ్ నాందేడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో తెలుగు వారు ఉన్న పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం సాగనుంది. నాందెడ్‌లో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా చదవండి.

3. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

నవంబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.  గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఇంకా చదవండి.

4. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని మృతి

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదువుకుంటున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన చింత స్నిగ్ధ అమనునాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే పుట్టినరోజు నాడే స్నిగ్ధ చనిపోవడంతో ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. మనీలాలోని పెర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమె పుట్టినరోజున విష్ చేద్దామని ఫ్రెండ్స్ ఆమె గదికి వెళ్లారు. ఇంకా చదవండి.

5. డిజిటల్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసా.?

రియల్ ఎస్టేట్ పెట్టుబడి గురించి అందరికీ తెలుసు. ఇల్లు లేదా భూమిని అద్దెకు ఇవ్వడానికి లేదా లాభానికి అమ్మడం. ఇది చాలా సులభం. డిజిటల్ రియల్ ఎస్టేట్ కూడా అదే విధంగా పని చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో చూసే ప్రతి డొమైన్ పేరు, వెబ్‌సైట్, బ్లాగ్ వంటివన్నీ ఇంటర్నెట్ ప్రాపర్టీ. వీటిని డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ అసెట్స్‌ అంటారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, స్థలాల మాదిరిగానే మీరు వీటిని కొనొచ్చు, అమ్మొచ్చు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget