Morning Top News: అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం - తెలంగాణలో ఒక్క క్లిక్‌తోనే మొబైల్‌లో అన్ని సేవలు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top News: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ ఉన్న మార్నింగ్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Morning Top News In AP And Telangana:
1. తిరుపతిలో అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం
మీకు బాధ్యత లేదా.?', 'ఇది ఆనందించే సమయమా.?' అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆయన గురువారం స్విమ్స్ ఆస్పత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కారు ఎక్కబోతుండగా అభిమానులు కేరింతలు, ఈలలతో హల్చల్ చేశారు. ఇంకా చదవండి.
2. కార్యకర్తలపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి అధికారంలోకి వచ్చే వరకూ పన్నెండేళ్ల పాటు తనతోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డ వారందర్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మర్చిపోయారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే రెండు రోజుల కిందట నెల్లూరు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఇక కార్యకర్తలను గొప్పగా చూస్తామని .. ఈ విషయంలో తాము నేర్చుకోవాల్సింది ఉందని అంగీకరించారు. ఇంకా చదవండి.
3. సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
ఒకప్పటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ఇప్పటి పద్మనాభరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లెటర్ రాశారు. అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా తన ఆవేదనను.. ఆవేశాన్ని, హెచ్చరికలను తెలిపే ఆయన ఈసారి చంద్రబాబుకు ఓ ప్రపోజల్ పెట్టారు. పార్టీలు వేరైనా పాతరోజుల్లాగా కలిసి ఉందామని హుందాగా రాజకీయాలు చేద్దామని ప్రతిపాదించారు. ఇంకా చదవండి.
4. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్
సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉందని.. ఆ మేరకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగకు 6,432 స్పెషల్ సర్వీసులు నడిపిస్తామని.. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇంకా చదవండి.
5. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో సమస్యా.?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ శర వేగంగా సాగుతున్నట్టు హోసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 95 శాతం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తైనట్టు తెలిపారు. ఇప్పుడు ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అర్హులు ఒక్కరు కూడా మిస్ కాకూడదని చెప్పుకొచ్చింది. ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు ఈ ఫిర్యాదుల వెబ్‌సైట్ యూజ్ అవుతుందన్నారు. ఇంకా చదవండి.
6. అన్ని సర్వీసులూ 'మీ టికెట్' యాప్‌లోనే..
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్క మొబైల్ యాప్‌లోనే అన్నీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, పర్యాటక ప్రవేశాల ఎంట్రీ టికెట్లు ఇలా ఏ సర్వీస్ కావాలన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పొందొచ్చు. ఇంకా చదవండి.
7. ఈ 3 బ్యాంకుల్లో ఎఫ్‌డీ రేట్లు మార్పు
ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఒక గొప్ప పెట్టుబడి ఎంపిక. దీనిలో తక్కువ రిస్క్ ఉంటుంది, ముందుగా హామీ ఇచ్చిన రాబడి కచ్చితంగా వస్తుంది. అయితే, ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే పరిమిత రాబడులు, ఎఫ్‌డీ వడ్డీపై ఆదాయ పన్ను చెల్లించాల్సి రావడం, అత్యవసర సమయంలో ఎఫ్‌డీని బ్రేక్ చేస్తే విధించే జరిమానా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ఎఫ్‌డీలపై ప్రజల ఆసక్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఇంకా చదవండి.
8. అగ్ని కీలల్లో లాస్ ఏంజిల్స్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు.. అనేక ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఐదుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం. అంతే కాకుండా వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు మొత్త కాలి బూడిదైనట్టు పలు అంతర్జాతీయ మీడియాలు కథనాలు వెల్లడించాయి. ఇంకా చదవండి.
9. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎలా ఉందంటే.?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు. కమల్ హాసన్, శంకర్ కలయికలో 'ఇండియన్ 2' చేయాలనుకున్నారు దిల్ రాజు. అయితే, దాని బదులు 'గేమ్ చేంజర్' కుదిరింది. 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? శంకర్ ఎలా తీశారు? సినిమాలో కథ, కథనాలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే... ఇంకా చదవండి.
10. 'గేమ్‌ఛేంజర్' సినిమాలో ఆ సాంగ్ లేదు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' ఈ సినిమా ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇలా భారీ హైప్ తో థియేటర్లలోకి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాలో విజువల్ వండర్ గా ఉండబోతుందని ముందుగానే మేకర్స్ 'నానా హైరానా' పాట గురించి చెప్పి ఊరించారు. ఇంకా చదవండి.