గన్నీ బ్యాగుల కొరత అంటూ దళారులు, వ్యాపారులు సిండికేట్ అయ్యారు- పత్తి ధరలు దించేశారు
జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తికి కనీస మద్దతు ధర 6380 ఇవ్వాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక మొన్నటి వరకు వ్యాపారులు పోటీపడి మరి తొమ్మిది వేల మార్కులు దాటించేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెల్లబంగారంగా పిలిచే పత్తి ఈసారి విరివిగా పండింది. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా పత్తికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో ధరలు ఎన్నడూ లేనంతగా అమాంతం పెరగసాగాయి. మరోవైపు వ్యాపారులు సైతం ఎగుమతి చేయడానికి పోటీలు పడి మరీ కొన్నారు. దీంతో అప్పటివరకు రైతు కళ్ళల్లో ఆనందం కనిపించింది. అయితే అది ఎంతో కాలం నిలవడం లేదు. విడివిడిగా వేలానికి దిగితే ధరలు పెంచాల్సి వస్తోందని గుర్తించిన వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి పత్తి ధరలను నేల మీదకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మికుంట పత్తి మార్కెట్లో జరుగుతున్న వ్యవహారం ఇదంతా నిజమేనని అనిపించేలా చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ధనం మరింత పెరుగుతుందని ఆశించిన పత్తి రైతులకు ఆకస్మాత్తుగా తగ్గుతున్న ధరలను చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఇలా సిండికేట్ అయ్యారు...
జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తికి కనీస మద్దతు ధర 6380 ఇవ్వాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో పత్తి దిగుబడి తగ్గిపోయి మన రాష్ట్రంలో మాత్రం బాగా పెరిగింది. ఇక మొన్నటి వరకు వ్యాపారులు పోటీపడి మరి తొమ్మిది వేల మార్కులు దాటించేశారు. ఇక నాలుగు రోజులపాటు కొనుగోలుకు సెలవు వచ్చింది. దీనికి గన్ని బ్యాగుల కొరత కారణం అంటూ తెలిపిన వ్యాపారులు ఆ సమయంలోనే సిండికేట్‌గా మారారు. అకస్మాత్తుగా 600 రూపాయలు తగ్గించి ధరణి 9350 నుంచి 8500కి తీసుకొచ్చారు.
అదనపు దోపిడీ ఇలా..
ఇక ఇక్కడితో వ్యాపారులో దోపిడీ ఆగడం లేదు. పత్తి సరిగా లేదంటూ క్వింటాల్‌కు మరో 200 వరకు కోత విధిస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపుగా నాలుగు నుంచి 6000 వరకు ధర తక్కువగా వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. పోయిన ఏడాది 12 నుంచి 14 వేల ధర పలకగా ఈసారి 9,000 మార్క్ దాటకపోవడం... దాటిన సమయానికి తిరిగి రకరకాల కారణాలతో ధర పెరగకుండా అడ్డుకున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న కూడా తమ లాభార్జన ధ్యేయంగా వ్యాపారులంతా సిండికేట్గా అయ్యారని రైతులు అంటున్నారు.
ఎందుకీ డిమాండ్?
అంతర్జాతీయంగా యుద్ధ భయాలు ముఖ్యంగా కీలకమైన పత్తి డిమాండ్ ను పెంచాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్ పత్తి ధర రూ.36వేల నుంచి రూ.38వేల దాకా పలుకుతున్నా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌లలో వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. రోజు రోజుకూ పత్తి ధర తగ్గుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కగా పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.