Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర-ఎంతో తెలుసా??
గత కొన్ని రోజుల క్రితం టమాటా ధర పెరిగిపోవడంతో టమాటా దొంగతనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి అవ్వగా మరి కొందరు కోటీశ్వరులు అయ్యారు.
ఇటీవల దేశవ్యాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఎక్కడ విన్న టమాట ధర గురించి వినిపించేది. ఇక్కడ చూసిన టమాట చర్చలే. గతంలో ఎన్నడు లేనంతగా కేజీ టమాట ధర 200, కొన్ని రాష్ట్రాల్లో 250 చేరి సామాన్యుల గుండెల్లో దడ పుట్టించింది.
గత కొన్ని రోజుల క్రితం టమాటా ధర పెరిగిపోవడంతో టమాటా దొంగతనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి అవ్వగా మరి కొందరు కోటీశ్వరులు అయ్యారు. అయితే దాదాపు రెండు నెలలుగా కొండేక్కి కూర్చున్న టమాటా ధరలు ప్రస్తుతం దిగివకు పడిపోయాయి. తెలంగాణతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పెరిగిన టమాటా ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయి.
టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల కిలో 200 కు చేరిన ధర.. ప్రస్తుతం భారీగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గత కొన్ని రోజులుగా కిలో టమాట 3 నుంచి 4 రూపాయల ధర పలికింది. ఇది కాస్త ఆదివారానికి 50 పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం అర ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు టమాట పంటను సాగు చేస్తారు. సెప్టెంబరు నెలలో అధిక మొత్తంలో దిగుబడి వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యమైన టమాటాను సైతం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత, కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాట రైతులకు అప్పులు తప్ప ఏమి మిగలవని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పుడు టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో టమాటా వాడకం సాధారణ స్థితికి చేరుకుంది. గతంలో ఒక్క 23 కేజీల టమాట బాక్స్ ధర 4300 పలికింది. కానీ ప్రస్తుతం కేవలం 50 పైసలకే టమాటాలు మార్కెట్లో దొరుకుతున్నాయంటే ధర ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. టమాటా రైతులు టమాటలను లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన రైతులు ప్రస్తుతం మార్కెట్లో ధర పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు.
వర్షాలు పడితే ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు చెప్పినా గాని... ప్రస్తుతం అందుకు భిన్నంగా మారిపోయింది. దీంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధర పడిపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటకు ధర రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. అప్పులు చేసి పంటను సాగు చేస్తే చివరకు అప్పుల మిగిలాయని చెబుతున్నారు. కనీస ధర ఉంటే అయిన బాగుండు అని వెల్లడిస్తున్నారు. టమోటా రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధరల్లో ఇంతటి భారీ వ్యత్యాసం రావడం ఇదే మొదటి సారి అని రైతులు వెల్లడిస్తున్నారు. కనీస మద్దతు ధర అయినా ప్రభుత్వం ప్రకటించాలని రైతులు వేడుకుంటున్నారు.