అన్వేషించండి

Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!

జూన్ 30న మధిరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. టెక్నికల్ లోపాలు లేకుండా వరుసగా 9 రోజుల పాటు 'బాటమ్-అప్' విధానంలో చిన్న రైతులకు మొదటగా నిధులు అందుతాయి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముఖ్యమంత్రి జూన్ 30న మధిరలో రైతు భరోసా పథకం ప్రారంభిస్తారు.
  • కొత్త నిబంధనలతో దశలవారీగా రైతుల ఖాతాలకు నిధులు విడుదల అవుతాయి.
  • మధిర సభలో వ్యవసాయ అభివృద్ధికి కీలక రోడ్ మ్యాప్ విడుదల చేస్తారు.

Rythu Bharosa Funds Release Date 2026: తెలంగాణలోని రైతులు ఆశగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. వానా కాలంలో సాగు సీజన్  ప్రారంభమై, ముసురు అందుకుంటున్న వేళ పెట్టుబడి సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫైనల్ చేసింది. ఈ నెల 30 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 

ఈసారి నిధుల పంపిణీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర నియోజకవర్గాన్ని వేదికగా మార్చుకున్నారు. జూన్ 30న మధిరలో నిర్వహించేబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఒక్క రోజులో కాకుండా ఎలాంటి టెక్నిలక్ గ్లిచెస్ లేకుండా ఉండేందుకు వరుసగా 9 రోజుల పాటు ఈ నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది. 

గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పేరిట కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మైనింగ్ జోన్లు వంటి వ్యవసాయేతర భూములకు వందల కోట్లు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లూప్ హోల్స్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేవలం సాగు భూములు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ రూపాయి చేరాలని గట్టిగా సంకల్పించింది. ఇందు కోసం నిర్వహించిన క్షేత్రస్థాయి ధ్రువీకరణలో దాదాపు 15 లక్షల ఎకరాల సాగుకు యోగ్యం కాని భూములను లిస్ట్ నుంచి తొలగించింది. 

వరుసగా 9 రోజులు ఫండ్స్ రిలీజ్ 

ఒకేసారి 73 లక్ష మంది అకౌంట్స్‌లోకి దాదాపు 9వేల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేయడం బ్యాంకింగ్ సర్వర్లపై తీవ్రమైన లోడ్‌ను క్రియేట్ చేస్తుంది. అందుకే రేవంత్ సర్కారు అత్యంత ప్లాన్డ్‌గా సక్సెసివ్ ఫేజ్‌లలో నిధులను రిలీజ్ చేస్తోంది. ఈ డిస్బర్స్‌మెంట్‌ స్ట్రాటజీ పూర్తిగా బాటమ్ అప్ అప్రోచ్‌లో సాగనుంది. మొదటి ఫేజ్‌ ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత పేద చిన్న సన్నకారు రైతులు ఫస్ట్ ప్రయార్టీ ఇస్తారు. రెండో ఫేజ్‌ లో రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఇలా భూమి విస్తీర్ణం పెరిగే క్రమంలో పెద్దరైతులకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 

మధిర సభలో అగ్రీ రోడ్‌ మ్యాప్ విడుదల

మధిర సభలో కేవలం ఫండ్స్ రిలీజ్ మాత్రమే కాకుండా అగ్రికల్చర్ కాన్‌క్లేవ్‌లా ప్రభుత్వం చేస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఏర్పాటు చేసిన హైలెవల్ సమన్వయ కమిటీ తన రిపోర్ట్‌ను సీఎంకు అందజేసింది. క్వాలిటీ సీడ్స్, సప్లై, క్రాప్ డైవర్సిఫికేషన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సభలో కీలక ప్రకటన చేస్తారు. 

రైతులు తమ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఆధార సీడింగ్, ఈకేవైసీ స్టేటస్ పక్కాగా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే యాక్టివ్ చేసుకోవాలి. మీ అకౌంట్ హోల్డ్‌లో ఉంటే వెంటనే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదించండి. వరి సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు  500 రూపాయల బోనస్ కావాలంటే మార్కెట్ యార్డ్ రశీదులను డిజిటల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం మర్చిపోవద్దు. 

Frequently Asked Questions

రైతు భరోసా నిధులు ఎప్పటి నుండి విడుదలవుతాయి?

రైతు భరోసా నిధులు జూన్ 30 నుండి విడుదల అవుతాయి. ఈ ప్రక్రియ 9 రోజుల పాటు వరుసగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.

రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది?

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో జూన్ 30న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తారు.

రైతు భరోసా నిధులకు కొత్త నిబంధనలు ఏమిటి?

కేవలం సాగు భూములు ఉన్న రైతులకు మాత్రమే నిధులు అందిస్తారు. వ్యవసాయేతర భూములను జాబితా నుండి తొలగించారు, దీనివల్ల దాదాపు 15 లక్షల ఎకరాలు జాబితా నుండి తీసేశారు.

రైతు భరోసా నిధుల పంపిణీ ఎలా జరుగుతుంది?

నిధుల పంపిణీ దశలవారీగా జరుగుతుంది. మొదట ఎకరం లోపు భూమి ఉన్న చిన్న రైతులకు, ఆపై రెండు, మూడు ఎకరాలు ఉన్నవారికి జమ చేస్తారు.

రైతు భరోసా నిధులు పొందడానికి రైతులు ఏమి చేయాలి?

రైతులు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్, eKYC స్టేటస్ తనిఖీ చేసుకోవాలి. వరి బోనస్ కోసం మార్కెట్ రశీదులను డిజిటల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget