AP Shallow Land: ఏపీలో భారీగా పెరుగుతోన్న నిస్సార భూమి, ఇస్రో సర్వేలో ఆసక్తికర విషయాలు! తెలంగాణలోనూ ఎంత పెరిగిందంటే

Shallow Land In AP: ఇస్రో సర్వే ప్రకారం.. సారవంతమైన భూమి గత ఆరు, ఏడు ఏళ్లలో భారీగా తగ్గిపోయింది. నిస్సారవంతమైన భూమి పెరిగిన రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానం, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నాయి.

FOLLOW US: 

Shallow Land In AP: మనకు ఆహారం కావాలంటే రైతన్నలే ఆధారం. వారు పంటలు పండిస్తేనే మనకు భోజనం లభిస్తుంది. కానీ పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా పంటలు, ఉత్పత్తి పెరగాలంటే రైతలు సంఖ్య పెరగాలి. భూమి స్థలం ఎలాగూ పెంచడం సాధ్యం కాదు. కానీ సారవంతమైన భూములు ఉంటేనే పంట ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో చేతికి అందుతాయి. ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ విడుదల చేసిన సర్వేలో ఆసక్తిర విషయాలు వెలుగు చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో సారవంతమైన భూమి గత ఆరు, ఏడు సంవత్సరాలలో భారీగా తగ్గిపోయింది. దేశంలోని రాష్ట్రాల జాబితాలో చూస్తే నిస్సారవంతమైన భూమి పెరిగిన వాటిలో ఏపీ ఆరో స్థానంలో, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నాయి.

స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ’డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77 శాతం) భూమి క్షీణతకు గురైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని 1,60,20,500 హెక్టార్ల భూభాగంలో 14.84 శాతం (2.37 మిలియన్‌ హెక్టార్లు) భూమి నిస్సారంగా మారిపోయింది. 2011-13 సంవత్సరాల కాలంతో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో   ఉంది. గత ఆరేడు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్లు ఎడారీకరణ చెందగా, తెలంగాణలో 39,652 హెక్టార్ల భూమి నిస్సారంగా మారినట్లు సర్వేలో తేలింది.

గత అయిదేళ్ల కాలంలో ఏపీలో భూక్షీణత దాదాపు ఒకటిన్నర రెట్లకు పైగా అధికమైంది. అటవీసంపద అంతరించిపోవడం, నీటికోత, వ్యవసాయ భూముల్లో నీళ్లు నిలిచిపోవడం, మానవ తప్పిదాలు కారణంగా భూమి క్షీణతకు గురై ఎడారీకీకరణ జరుగుతున్నట్లు ఇస్రో తేల్చింది. 

2011-13తో పోల్చితే 2018-19 నాటికి పచ్చదనం క్షీణత 5,927 హెక్టార్లలో జరగగా ప్రస్తుతం ఇందులో 11,70,184 హెక్టార్లున్నాయి.
నీటి కోత ద్వారా 11,847 హెక్టార్లు తగ్గిపోయింది, ప్రస్తుతం 8,01,280 హెక్టార్లు ఉంది.
లవణాల కారణంగా 1,416 హెక్టార్లు తగ్గి, 1,19,368 హెక్టార్లు అయింది. 
నీరు నీల్వ అయిన కారణంగా 34,007 హెక్టార్లు తగ్గిపోయి, 1,66,341 హెక్టార్లకు పరిమితమైంది.
మానవ తప్పిదాలతో 9,369 హెక్టార్లు నిస్సార భూమిగా మారింది. సెటిల్మెంట్ ద్వారా 16,717 హెక్టార్లు తగ్గిపోయి 66,158 హెక్టార్లకు చేరింది. 

భూ క్షీణత (భూమి నిస్సారంగా మారడం) అధికంగా ఉన్న రాష్ట్రాలు..
రాష్ట్ర భూభాగం పరంగా చూస్తే ఝార్ఖండ్‌లో 68.77% శాతం భూమి క్షీణతకు గురైంది. రాజస్థాన్‌లో 62.06 శాతం, ఢిల్లీలో 61.73 శాతం, గోవాలో 52.64 శాతం, గుజరాత్‌లో 52.20 శాతం భూమి క్షీణతకు గురైనట్లు సర్వేలో వెల్లడించారు. తెలంగాణలో 31.68 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.84 శాతం భూమి క్షీణతకు గురై నిస్సారమైన భూమి తగ్గిపోయింది.

Published at : 23 Feb 2022 11:44 AM (IST) Tags: ANDHRA PRADESH ISRO agriculture Shallow Land In AP Space Application Centre Land In AP Shallow Land

సంబంధిత కథనాలు

Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !