PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్.. నెక్స్ట్ విడత డబ్బులు పడేది ఎప్పుడంటే?
రైతులకు పీఎం కిసాన్ నిధి యోజన పథకం కింద కేంద్రం ఏటా పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఆరువేలను విడతల వారీగా ఇస్తోంది. ఇప్పటికే జనవరి1న రెండు వేలను రైతు ఖాతాల్లో వేసింది.
ఆరువేల రూపాయలను ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తోంది. పెట్టుబడి సాయం కింద ఈ నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా వేస్తోంది. కరోనా టైంలో ఈ డబ్బులు రైతులకు చాలా ఉపయోగపడ్డాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఓ విడత డబ్బులను జనవరి 1న రైతుల ఖాతాల్లో వేసిన ప్రభుత్వం తర్వాత విడత డబ్బులు ఎప్పుడు వేస్తారనే చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ మొదటి వారంలో పీఎం కిసాన్ యోజన నిధులు రైతు ఖాతాల్లో పడనున్నాయని సమాచారం. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ యోజన పథకానికి ఇచ్చే నిధులు పెంచితే మాత్రం రైతుల పంట పండినట్టే.
PM Kisan 10th installment not received: पीएम किसान का पैसा नहीं आया तो क्या करें #PMKisan #PMKisan10thinstallment #PMKisanYojana #PMKisanHelpline @pmkisanyojana https://t.co/RFKnQYCUMu pic.twitter.com/3KYqivMh8N
— PM Kisan Yojana (@pmkisanyojana) January 2, 2022
పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఇప్పటికి ఏడాదికి ఆరువేలు ఇస్తున్న కేంద్రం మరో రెండు వేలు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని వినికిడి. అందుకే ఏప్రిల్‌లో పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా డబ్బులు పడటం ఖాయమైనా ఎంత పడుతుందనేది ఇప్పుడు కొత్త చర్చ. దీనిపై నిర్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.