అన్వేషించండి

Etala Rajender: మాటలు తప్పా చేతలు లేవు, రూ.10 వేలు సాయం, ప్రకటనకే పరిమితం: ఈటల రాజేందర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మాటలు తప్ప చేతలు లేవు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మాటలు తప్ప చేతలు లేవు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి. అధికారులకు సంపూర్ణ అధికారాలు ఇచ్చి ఖచ్చితమైన నష్టాన్ని అంచనా వేయాలి. బీజేపీ వచ్చాక విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతుకి అండగా ఉంటాం అన్నారు. 

కమలాపూర్ మండలం అంబాల ఐకేపీ సెంటర్ లో తడిచిన ధాన్యంను పరిశీలించి, రైతులతో మాట్లాడారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇక్కడ ధాన్యం పోసి వారం రోజులు అయ్యింది. ఈరోజు ఐకేపీ  సెంటర్ ను ప్రారంభించారు కానీ కొనుగోళ్లు మొదలు కాలేదని.. పండిన ధాన్యం అంతా తడిచి పాడయ్యిందని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తుమ్మల భాగ్య లక్ష్మి  మక్కచేను పూర్తిగా నేలమట్టం కావడంతో మక్కచెను పరిశీలన చేశారు. లక్ష రూపాయల పెట్టుబడి పెట్టానని మొత్తం మట్టిపాలు అయ్యిందని ఆమె వాపోయారు. ప్రభుత్వము నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కమలాపుర్ మండలంలో అంబాలా, పెరకపల్లి, గునుపర్తి, నేరెళ్ళ, గూడూరు, కమాలపూర్ గ్రామాల్లో  వర్షం వల్ల నష్టపోయిన మక్కచేలు, మామిడి తోటలు, వరి పంట, ఐకేపీ సెంటర్స్ లొ తడిచిన ధాన్యం... ధ్వంసం అయిన ఇళ్ళు, దళితబంధు షడ్డులను పరిశీలించి నష్టపోయిన రైతులతో, బాధితులతో మాట్లాడారు ఈటల రాజేందర్. తరువాత  కమలాపూర్ మార్కెట్ యార్డ్ లో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల మీద ప్రకృతి కన్నెర్ర చేసింది. మార్చిలో వడగళ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే... సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో తిరిగి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు సైతం ఎకరానికి పదివేలు సహాయం అందిస్తామని చెప్పారు. కానీ ఈ రోజువరకు ఒక్క రూపాయి సాయం అందించలేదు అని విమర్శించారు.

పోయిన ఏడాది కూడా పంట నష్టపోయింది. మిర్చిపంట నేలపాలు అయితే మేము వెళ్లి పరిశీలించి నష్టపరిహాన్ని డిమాండ్ చేస్తే .. మంత్రుల బృందం వచ్చి తిరిగిపోయింది తప్ప  ఏడాది అయినా ఒక్క రూపాయి రాలేదని గుర్తుచేశారు. మొన్న తాకిడికి తట్టుకొని మిగిలిన పంట ఈ సారి పూర్తిగా పోయింది. ఇళ్ల మీద ఉన్న రేకులు, దళిత బందు రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి, 
మామిడి కాయ రాలిపోయింది, మిర్చి, మక్క, వరి అన్నీ కొట్టుకుపోయాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎవరు రాలే.. వచ్చినా రాసుకుపోవడం లేదు. ఓదార్చడం లేదు. చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. 
పంజాబ్, మహారాష్ట్ర రైతులను కాదు నీకు ఓట్లు వేసి గెలిపించిన వారి బ్రతుకులు ఆగం అవుతున్నాయి. వారిని ఆదుకోండి లేకపోతే వారి ఉసురు తగులుతుంది అన్నారు ఈటల రాజేందర్. 
రైతుబంధు ఇచ్చి ఫసల్ భీమా ఖతం పట్టించారు. డ్రిప్, స్పింక్లర్, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్, ఇంకా అనేక స్కీమ్ లు అన్నీ ఖతం పట్టించారు. నష్టపోయిన మామిడి తోటలకు ఎకరానికి లక్ష రూపాయలు, మక్కలకు ఏకరానికి 40 వేలు, వరికి 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

వరికోతలు పూర్తి అవుతున్నాయి,  అయినా ఐకేపీ సెంటర్స్ ప్రారంభం కాలేదు. సాధారణంగా రెండు నెలల ముందే సమీక్షలు చేసి కాంటాలు, గన్నీ బస్తాలు, తార్పాల్, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేసేవారు. అన్నీ నాకే తెలుసు అన్నట్టు వ్యవహరించి కేసీఆర్ రైతులను ఆగం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన ధాన్యం రాసులు కొట్టుకు పోతుంటే రైతు తట్టుకోలేరు. ఏడుస్తున్నారు.  వరిధాన్యం తడిచి ముద్ద అయ్యింది, మొలకలు వస్తున్నాయి. ఆ ధాన్యం ఎలా ఉన్నా  ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఏం జరుగుతుంది పంజాబ్, మహారాష్ట్ర రైతులకు తెలియదు. ఇక్కడ రైతులు ఎలా నష్టపోతున్నారు అని తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మన రైతులు పడుతున్న బాధలు. రైతుబంధు ఇస్తా అని చెప్పి వారిని కూడా మోసం చేస్తున్నారు. కేసీఆర్ మోసపు మాటలు వారు కూడా నమ్మరు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget