Budget 2022: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ యోజన్ ఎంత పెరగనుందంటే?
రాబోయే బడ్జెట్‌లో కేంద్రం రైతులకు ప్రత్యేక వరాలు ప్రకటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తైందని ప్రకటనే ఆలస్యమంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
రైతులకు కేంద్రం గుడ్ చెప్పనుంది. అధికారిక సమాచారం ప్రకారం రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే నిధులను పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి1 కేంద్రం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు చట్టాలను వెనక్కి తీసుకుంది. దీనికి తోడు బడ్జెట్‌లో మరిన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందని సమాచారం. కరోనా టైంలో అన్ని సెక్టార్లతోపాటు వ్యవసాయ రంగం కూడా దెబ్బతింది. అందుకే దీన్ని అభివృద్ధి చేసుకునేలా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అందులో భాగంగానే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేటాయింపులు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీని వల్ల పది కోట్ల మందిర ప్రజలు లబ్ధి పొందుతున్నారు. గత బడ్జెట్‌లో 65వేల కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని మరింతగా పెంచనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతుకు ఆరు వేలు ఇస్తున్నారు. దీన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్టు సమాచారం.
కనీస మద్దతు ధరపై కూడా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారట. అన్ని పంటలకు వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నారని బోగట్టా. మూడు చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత తెరపైకి వచ్చిన ప్రధాన డిమాండ్ ఇది. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలని మొన్నటి వరకు రైతులు ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇలా ప్రకటించడం ఎన్నికల నియామవళికి వ్యతిరేకమా కాదా అన్న దానిపై క్లారిటీ తీసుకున్న తర్వాతే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆయా రాష్ట్రాలకు ఉద్దేశించిన పథకం కాదని... దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని కేంద్రం పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది.
రుణ పరిమితిని కూడా పెంచాలని భావిస్తోంది కేంద్రం. ప్రస్తుతం ఉన్న 16.5 లక్షల రుణ పరిమితిని 18 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ రేటుతో రైతులకు మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తోంది కేంద్రం. దీంట్లో రెండు శాతం వడ్డీ రాయితీ అందిస్తోంది. గడువులోపు రుణాలు చెల్లించిన వారికి మూడు శాతం అనదపు ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో అంటే నాలుగు శాతంతో రైతులకు రుణాలు ఇప్పిస్తోంది. దీన్ని కూడా పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!