అన్వేషించండి

Sanjal Gavande: అమెజాన్ అధిపతి జెఫ్ బైజోస్ స్పేస్ రాకెట్ తయారీలో పాల్గొన్న భారతీయ యువతి గురించి తెలుసా..?

ఆడపిల్లవి నీకెందుకు మెకానికల్ ఇంజనీరింగ్ అన్నారు.. పట్టించుకోలేదు.. నాసా రిజెక్ట్ చేసింది.. ప్రయత్నం ఆపలేదు.. మహారాష్ట్ర నుంచి బ్లూ ఆరిజన్ వరకు వెళ్లింది. కలను నిజం చేసుకుంది. ఆమె మన సంజల్ గవాండే.

2021ని ఇండియన్ ఉమన్ స్పేస్ ఇయర్ అంటే బాగుంటుందేమో. వ్యోమగాములుగా, ఇంజనీర్లుగా మన అమ్మాయిలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన తెలుగమ్మాయి శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్ సంస్థ రూపొందించిన యూనిటీ 22 వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లగా.. తాజాగా మరో భారతీయ యువతి సంజల్ గవాండే (30) బ్లూ ఆరిజన్ (Blue Origin) సంస్థ రాకెట్ తయారీలో కీలక పాత్ర పోషించారు. అమెజాన్, బ్లూ ఆరిజన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ జూలై 20న అంతరిక్షయానం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయన ప్రయాణించనున్న న్యూ షెపర్డ్‌ (New Shepard) రాకెట్ అభివృద్ధిలో సంజల్ కీలక పాత్ర పోషించారు. అసలు ఎవరీ సంజల్ గవాండే? ఈమెను నాసా ఎందుకు రిజెక్ట్ చేసింది?

Sanjal Gavande: అమెజాన్  అధిపతి జెఫ్ బైజోస్ స్పేస్ రాకెట్ తయారీలో పాల్గొన్న భారతీయ యువతి గురించి తెలుసా..?

  • మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతంలో ఉన్న కోల్సేవాడికి చెందిన సంజల్ తండ్రి అశోక్ గవాండే. ఈయన కల్యాణ్ దోంబీవిల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. తల్లి సురేఖ ఎంటీఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి.
  • సంజయ్ ముంబై యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మాస్టర్స్ చేసేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్‌ టెక్నోలాజిక్‌ యూనివర్సిటీలో చేరారు.
  • అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆసక్తితో మాస్టర్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. మాస్టర్స్ పూర్తి చేసిన తరువాత, సంజల్ విస్కాన్సిన్‌లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో మూడేళ్ల పాటు పనిచేశారు.

Sanjal Gavande: అమెజాన్  అధిపతి జెఫ్ బైజోస్ స్పేస్ రాకెట్ తయారీలో పాల్గొన్న భారతీయ యువతి గురించి తెలుసా..?

  • తర్వాత కాలిఫోర్నియాలోని ఆరెంజ్ సిటీలో టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌లో మెకానికల్ డిజైనింగ్ ఇంజనీర్ గా పనిచేశారు.
  • అంతరిక్ష రంగంలో పనిచేయాలనే సంకల్పంతో నాసాలో ఇంజనీర్‌ ఉద్యోగం కోసం సంజల్ దరఖాస్తు చేసుకున్నారు. పౌరసత్వ సమస్యల కారణంగా నాసా ఆమెను రిజెక్ట్ చేసింది.
  • నిరాశ పడకుండా ఆమె సీటెల్‌లోని బ్లూ ఆరిజిన్‌ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిస్టమ్స్ ఇంజనీర్ కోసం ఇంటర్వ్యూలో విజయం సాధించగా.. ఆమెను న్యూ షెపర్డ్ రాకెట్ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం బ్లూ ఆరిజన్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
  • " సంజల్ చిన్నప్పటి నుంచి నెమ్మదస్తురాలు. చదువులో చాలా చురుగ్గా ఉండేది. తనకు డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఆడపిల్ల కదా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎందుకు చేర్పించారు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఈ రంగంలో ఉండే కష్టతరమైన పనులను మా అమ్మాయి హ్యాండిల్ చేయగలదా? అని నేను కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నా. కానీ తను మా అంచనాలన్నీ తప్పని నిరూపించింది. ఏరోస్పేస్ రాకెట్లను డిజైన్ చేయాలనే తన కలను సాకరం చేసుకుంది. మేమంతా గర్వించే స్థాయికి ఎదిగింది. "
    -సంజల్ తల్లి సురేఖ

Sanjal Gavande: అమెజాన్  అధిపతి జెఫ్ బైజోస్ స్పేస్ రాకెట్ తయారీలో పాల్గొన్న భారతీయ యువతి గురించి తెలుసా..?

  • " అంతరిక్ష రంగంలో పనిచేయాలన్న నా చిన్ననాటి కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజన్ సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను.   "
    -సంజల్

అంతరిక్షంలోకి 18 ఏళ్ల కుర్రాడు.. 
బ్లూ ఆరిజన్ చేపట్టనున్న రోదసీ యాత్రలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో 18 ఏళ్ల కుర్రాడు చేరబోతున్నాడు. న్యూ షెఫర్డ్  నెదర్లాండ్స్‌కు చెందిన ఒలివ్ డేమెన్ (18 ఏళ్లు) తమ ప్రయాణంలో చేరనున్నట్లు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. మిలీయనర్, సోమర్సెట్ క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు, CEO అయిన జోస్ డెమెన్ కుమారుడే ఈ ఒలివ్. ఈ యాత్ర ద్వారా అంతరిక్షయానం చేసిన అతిపిన్న వయస్కుడిగా ఒలివ్ రికార్డు సృష్టించనున్నాడు. అయితే ఈ అంతరిక్ష యాత్రకు ఒలివ్ ఎంత మొత్తం చెల్లించాడనే వివరాలు వెల్లడి కాలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Mumtaz Hotel : శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ - జగన్ సర్కార్ అనుమతి - టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తుందా ?
Target Revanth Reddy :  రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే -  పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ బలహీనమైనట్లే - పక్కా ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ రాజకీయం !
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్- ఈ ప్రాంతాలపైనే పార్టీల ఫోకస్
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Embed widget