కాంతార భూతగణాల కథ.. ఊహకందని ఈ శక్తి ఈ గణాల సొంతం
కాంతార, కాంతార చాప్టర్ 1.. ఈ రెండు మూవీస్ మీలో ఎంతమంది చూశారు..? ఫస్ట్ కాంతార మూవీలో వరాహాన్ని ఎక్కువగా చూపించారు.. అయితే.. అది పింజుర్లి దేవుడు కాబట్టి చూపించారు అనుకోవచ్చు. మరి రెండో మూవీలో పులి చుట్టూ చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంటుంది. అయితే ఈ పులి ఎవరు? ఏ గణం? ఓన్లీ పులి మాత్రమే కాదు.. జాగ్రత్తగా గమనిస్తే.. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే మనకి ఎద్దు గణాన్ని కూడా చూపిస్తారు. మరి ఆ ఎద్దు ఏ దేవత? మూవీ చివర్లో గుళిగ కాకుండా.. చావుండి అనే గణం హీరోని ఆవహించి విలన్స్‌ని చంపేస్తుంది. ఈ చావుండి ఎవరు? అసలు ఇలాంటి గణాలు ఇంకెన్నున్నాయి? వాటి బ్యాక్ స్టోరీ.. అంటే ఆ దేవ గణాల చుట్టూ.. ఉన్న ఇతిహాసాలు ఏంటి? పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో చూద్దాం.
హాయ్ అండ్ వెల్‌కమ్ టూ మిస్టరీ టూ హిస్టరీ. పంజుర్లి, ఉల్లేయ, మహిసండయ్య, గుళిగ, చావుండి, వీళ్లంతా తుళునాడు ప్రాంతంలో నివశించే ప్రజలు పూజించే పొలిమేర దేవతలు. ఆ కాలంలో మన దక్షిణ భారతేశంలో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి.. అడవుల్లో నివసించే ఆటవిక తండాలు, ఆదివాసీ సమూహాలు.. వాళ్లు పూజించే దేవతలని.. చుట్టూ ఉండే జంతువుల్లోనే చూసుకునేవాళ్లు. ఎద్దుని నందిగా, కుక్కని భైరవుడిగా.. ఇలా మనం కూడా పూజిస్తుంటాం కదా. సేమ్ అలాగే తుళునాడులో ఉండే ఆటవికులు, ఆదివాసీలు పూజించే వన దేవతలు లేదా పొలిమేర దేవతలే ఈ గణాలన్నీ.





















