టోనీ డ్రగ్స్ మాఫియాపై పంజాగుట్ట పోలీసుల రెండో రోజు విచారణ
డ్రగ్స్ మాఫియా డాన్ టోనిపై పంజాగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండోరోజూ టోనిని విచారించిన పోలీసులు.....ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ స్టార్ బాయ్ గురించి ఆరా తీశారు. ముంబై, గోవాల్లో టోనికి షెల్టర్స్ ఇచ్చిన వాళ్లపైనా కూపీలాగిన పోలీసులు....హైదరాబాద్ లో హిమాయత్ నగర్ కి చెందిన ఓ కాంట్రాక్టర్ కి ముఫైసార్లు కొకైన్ ఇచ్చినట్లు గుర్తించారు. టోనీ దగ్గర 60కి పైగా రిపీటెడ్ కస్టమర్లు ఉన్నట్లు విచారణలో రాబట్టిన పోలీసులు...స్టార్ బాయ్ ను పట్టుకోవటమే లక్ష్యంగా విచారణ సాగించారు. పోలీసుల ప్రశ్నలకు సమాదానాలు దాటవేస్తున్న టోనీ.. మౌనమే సమాధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని మొబైల్, డిలీటెడ్ డేటా ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.





















