నిజామాబాద్ బుస్సాపూర్ జాతీయ రహదారిపై కాలిన నోట్ల కట్టలు
రెన్సీ నోట్లు కాలి బూడిదై రోడ్డుపై పడ్డ ఘటన కలకలం రేపుతోంది. జాతీయ రహదారిపై కరెన్సీ నోట్ల కట్టలు దగ్ధమై కనిపించడం, పలు అనుమానాలకు తావిస్తోంది. నోట్లని తుక్కుగా మార్చి తగలబెట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తుండటంతో, బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు పలు సందేహాలు రేపుతున్నాయి. విచారణ చేస్తున్న పోలీసులు,ఏదైనా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనంలో నుండి సంచి కిందకు జారి పడిపోయి ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. అయితే తగలబెట్టినవి దొంగ నోట్లా లేక, అసలు నోట్లా,ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా చేసిన పనా?అనే సందేహాలు వెల్లువెత్తుతుండటంతో, పోలీసులు విచారణ చేపట్టారు. జాతీయ రహదారిపైనున్న సీసీ ఫుటేజ్ ద్వారా.. ఆ కాలిపోయిన నోట్లపై ఆరా తీసేందుకు యత్నిస్తున్నారు.



















