Dalita Bandhu CM KCr: సర్కార్ చేయగూసొంగ.. ముఖ్యమంత్రి ఇయ్యగూసున్నాంక ఏదన్నా ఆగుతదా? రాజు తలుచుకున్నాక దెబ్బలకు కొదువుంటదా?
కరీంనగర్ జిల్లా శాలపల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ‘తెలంగాణ దళితబంధు’ పథకాన్ని ప్రారంభించారు. డబ్బులు వచ్చాయ కదా అని ఆగం కావద్దని... డబ్బులను జాగ్రత్తగా పైసల వచ్చే దగ్గర ఖర్చు పెట్టాలని సూచించారు. ప్రజలను ఆలోచింపజేస్తూనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘నడిమొళ్లకు ఎందుకు కడుపు ఉబ్బస’ అని దళితబంధుపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘కిరికిరిగాళ్లు.. కొండిగాళ్లు ఒకరు కీ.. ఒకరు కా అంటే’ అంటూ ప్రతిపక్ష నాయకుల విమర్శలపై స్పందించారు. ‘సర్కార్ చేయగూసొంగ.. ముఖ్యమంత్రి ఇయ్యగూసున్నాంక ఏదన్నా ఆగుతదా? రాజు తలుచుకున్నాక దెబ్బలకు కొదువుంటదా?’ అని దళిత బంధును ఎవరూ ఆపలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు.సభ నుంచి నిష్క్రమిస్తుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కేసీఆర్ చేతిని ముద్దాడారు.
ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన హుజురాబాద్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపిక అందించారు. అంబేడ్కర్‌తోపాటు సీఎం కేసీఆర్‌ను చిత్రించిన భారీ పెయింటింగ్‌ను కేసీఆర్‌కు అందించి ఆ పెయింటింగ్ వివరాలను కౌశిక్ రెడ్డి వివరించాడు.