Jr NTR At High court | తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్ | ABP Desam
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మహిళ చేతిలో మోసపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో ఇరవైఏళ్ల క్రితం తారక్ కొన్న ఓ స్థలం విషయంలో ఓ మహిళ తనను మోసగించినట్లు ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తారక్ 2003లో గీతాలక్ష్మి మహిళ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు. అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే స్థలంపై గీతాలక్ష్మి ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా రుణాలు పొందారు. ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆ లోన్లు తీసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు స్థలం అమ్మే సమయంలో ఈ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టారు. ఐదు బ్యాంకుల నుంచి ఇదే డాక్యుమెంట్ మీద గీతాలక్ష్మి రుణాలు తీసుకున్నారు. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీతాలక్ష్మి చెప్పారు. తారక్ చెన్నైలోని ఆ బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు.. 2003 నుంచి ఎన్టీఆర్ ఆ స్థలానికి యజమానిగా ఉన్నారు. అప్పటి నుంచి మిగిలిన బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది.. ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్లపై జూనియర్ ఎన్టీఆర్ 2019లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకర్లు డెట్ రికవరీ ట్రిబ్యూనల్ DTR ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. DTR నుంచి తారక్ కు వ్యతిరేకంగా ఆదేశాలు రావటంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
![MLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/10ee9fe08edac2609b493e22446a3c731739719692845310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Caste Census Re Survey in Telangana | ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/b7012449f92a4f8e92dfa6baee8d12481739548633901310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Br Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/402e8b4b9b6e61b4ac70dbeb7e3df0181739376687708310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/983f773eadf5db569af3819a09e7b6e11739297245650310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Maha Kumbh Madhya Pradesh Road Accident | కుంభమేళా యాత్రలో ఘోర విషాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/1332877a60dabb139e33ac602434e69a1739296337586310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)