(Source: ECI/ABP News/ABP Majha)
Jainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP Desam
Jainoor Tribal Woman Incident | కొమురంభీం జిల్లా జైనూర్ మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళపై జరిగిన లైంగికదాడిని నిరసిస్తూ...జైనూరులో పెద్ద ఎత్తున్న ఆదివాసీలు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వసం చేశారు. దీంతో జైనూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.ఆందోళనకారులు మార్కెట్లో తోపుడు బండ్లను నిప్పు అంటించారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు జైనూర్‌లో పహారా కాస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా గస్తీ కాస్తున్నారు. జైనూర్‌లో గురువారం ఉదయం నుంచి 48 గంటలపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ ఘటనపై అందరు సంయమనం పాటించాలని లా అండ్ ఆర్డర్ అదనపు డి.జి. మహేష్ భగవత్ కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే... ఆ బాధితురాలిని కలిసి పరామర్శించేందుకు నేడు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారని సమాచారం.