Hyderabad Gulzar House Fire Accident Reasons | చిన్నారుల ప్రాణాలు చిదిమేసిన అగ్ని ప్రమాదం | ABP Desam
హైదరాబాద్ చార్మినార్ కు కాస్తంత దూరంలోనే ఇంతటి భారీ అగ్నిప్రమాదం జరగటం రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఒక భవనం నుంచి మరో భవనానికి అంటుకోవటం..దట్టమైన పొగలు వ్యాపించటంతో 17మంది ప్రాణాలను మంటలు బలిగొన్నాయి. తక్షణమే చికిత్స కోసం తరలించినా ఊపిరితిత్తుల్లో పొగ నిండిపోయిన కారణంగా ఆ 17మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన 17మందిలో 7ఏళ్ల లోపు చిన్నారులు 8మంది ఉండటం. జరుగుతుంది ఏంటో వాళ్లకు తెలియదు..ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఘోర విషాదంలో 8మంది చిన్నారులు కన్ను మూశారు. చనిపోయిన చిన్నారుల్లో ఏడేళ్ల హమేయ్, నాలుగేళ్ల ప్రియాంశ్, రెండేళ్ల ఇరాజ్, మూడేళ్ల ఆరుషి, ఏడాదిన్నర వయస్సున్న ప్రథమ్, మూడేళ్ల అనుయాన్, నాలుగేళ్ల వయస్సున్న ఇద్దు ఉన్నారు. సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవటం..ఫైర్ ఎగ్జిట్స్ లేకపోవటం..ఇరుకైన గల్లీల్లో ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు..ఇవన్నీ నిర్లక్ష్యాలుగా మారి 17మంది ప్రాణాలతో పాటు 8మంది పసిబిడ్డలను చిదిమేశాయి.





















