Hyderabad Family burnt Alive in America | అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం
హైదరాబాద్ కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాకు వెకేషన్ కు వెళ్లారు. సుచిత్రలో నివాసం ఉండే ఈ ఫ్యామిలీ డల్లాస్ వెళ్లింది. సెలవులు ఉండటంతో అట్లాంటలోని తమ బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అట్లాంటలో ఉన్నారు.
అక్కడి నుండి అర్థరాత్రి డల్లాస్ కు శ్రీవెంకట్ కుటుంబం తిరుగు ప్రయాణం అయింది. కానీ గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న నలుగురు సజీవ దహనం కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన తరువాత పోలీసులు ఆ మృతదేహాలను అప్పగించనున్నారు. వెకేషన్ కు వెళ్లిన వారు ప్రమాదం జరిగి పిల్లలతో సహా సజీవదహనం కావడంపై వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.





















