వీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!
Chicken seized in Hyderabad Begumpet by food safety officers: హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ లో పాడైపోయిన 700 కిలోల చికెన్ ను (Chicken in Hyderabad) ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన పదార్థాలను విక్రయిస్తున్నట్లు ఆహార భద్రత అధికారులు తెలిపారు. గత కొన్నాళ్లుగా గోదాంలో కోడి కొవ్వు, కాళ్లు, ఎముకలను రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచినట్లు తెలిపారు. నిల్వ ఉంచిన చికెన్ ను (Food in Begumpet) ఆ చుట్టుపక్కల మద్యం దుకాణాలకు, బార్లకు, చిన్న హోటళ్లకు సరఫరా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కోడిలోని వ్యర్ధ పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి అమ్మడం మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం (Chicken in Hyderabad) ఉందని పేర్కొన్నారు. గత ఆరు నెలల నుండి చికెన్ లోని విడుదల పదార్థాలను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తున్నట్లు వెల్లడించారు.