మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపం
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం చూస్తున్నాం.. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ చూశాం. ఇప్పుడు మరో యుద్ధం ముంచుకొస్తుందా అంటే అవే సూచనలు కనిపిస్తున్నాయి. తైవాన్‌తో చైనా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. యుద్ధానికి రెడీ అవ్వాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ సైన్యానికి పిలుపునిచ్చినట్లుగా అక్కడి అధికారిక మీడియా కథనాలు రాసింది.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను కొద్ది రోజుల క్రితం సందర్శించారు. అదే సమయంలో యుద్ధానికి రెడీ అవ్వాలని.. సన్నాహాలను బలోపేతం చేయాలని వారికి సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. సైన్యం అంతా పోరాట పటిమను కలిగి ఉండాలని.. స్ట్రాటజీతో శత్రువుపై పోరాడేలా ప్రణాళికలు చేయాలని షీ జిన్ పింగ్ సూచించినట్లుగా తెలిసింది. దేశ భద్రత, ప్రయోజనాలే సైన్యానికి ప్రథమ ప్రాధాన్యం కావాలని సూచించినట్లు చైనా పత్రికలలో వచ్చింది.
తైవాన్ సముద్రంలో ఒక చిన్న ద్వీపం. దీని చుట్టూ చైనా కొద్ది రోజులుగా military drills ప్రారంభించింది. 153 యుద్ధ విమానాలు.. చైనా కోస్ట్‌గార్డుకు చెందిన అతిపెద్ద నౌక.. తైవాన్ ద్వీపం చుట్టూ కాపలాగా కూడా ఉంటోంది. సొంతంగా పరిపాలన చేసుకుంటున్న తైవాన్‌ను చైనా అలా గుర్తించడం లేదు. తైవాన్ తమ దేశంలో ఒక భాగమే అని చైనా పట్టుబడుతోంది. తైవాన్‌ను చైనా తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గానే చూస్తుంది. చైనాలో తైవాన్ ను కలిపేసుకోడానికి అవసరమైతే బలప్రయోగం చేస్తామని అంటోంది. అలాంటిది ఈ ఏడాది మొదట్లో తైవాన్ అధ్యక్షుడిగా Lai Ching-te ప్రమాణం చేశాక.. తైవాన్ స్వయం పాలిత హోదాను కొనసాగిస్తామని స్ట్రాంగ్‌గా చెప్పారు. దీంతో చైనా సైనిక విన్యాసాలను పెంచి.. యుద్ధానికి కాలుదువ్వుతోంది.