సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్నా...రోహిత్ సేవలు మిస్సవుతా
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలిగింపుపై వివరణ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటున్నట్లు స్పష్టం చేశాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటున్నానని కొహ్లీ స్పష్టం చేశాడు. ఎప్పుడూ బీసీసీఐను రెస్ట్ అడగలేదన్న కొహ్లీ.... సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ సేవలను భారత్ కచ్చితంగా మిస్ అవుతుందన్నాడు. తన బాధ్యతల పట్ల ఎప్పుడూ నిబద్ధతతో వ్యవహరిస్తానన్న కొహ్లీ..... టెస్ట్ టీమ్ గురించి చర్చ జరిగిన తర్వాత.. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చీఫ్ సెలక్టెర్ సమాచారమిచ్చారని వెల్లడించాడు. రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై కూడా కోహ్లీ స్పందించాడు. తనకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని గత రెండేళ్లుగా చెప్పిచెప్పి అలసిపోయానని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.