SRH Beats RR Steps in Finals | క్వాలిఫయర్ 2లో ఆర్ఆర్‌పై ఎస్ఆర్‌హెచ్ విక్టరీ | ABP Desam
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు దూసుకుపోయింది. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 136 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఏంటో చూద్దాం.
1. ఫస్ట్ 8 ఓవర్లలో రైజర్స్ ఫుల్ డామినేషన్ - ఈ మ్యాచ్‌లో మొదటి ఎనిమిది ఓవర్లలో సన్‌రైజర్స్ పూర్తిగా డామినేట్ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా వచ్చిన వాళ్లు వచ్చినట్లు ఫాస్ట్‌గా ఆడటంతో రైజర్స్ 8 ఓవర్లు అయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
2. మళ్లీ ఆదుకున్న క్లాసెన్ - అతి వేగంగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి క్లాసెన్‌కు సపోర్ట్ రాలేదు.
3. సందీప్, అవేష్ సూపర్ - రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ, అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ ఎకానమీ 6.2 కాగా, అవేష్ ఖాన్ ఎకానమీ 6.8 మాత్రమే. అవేష్ ఖాన్ మూడు వికెట్లు, సందీప్ శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా అద్బుతంగా చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. కానీ 11.2 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.
4. అభిషేక్ ఆల్‌రౌండ్ షో - సన్‌రైజర్స్ హైదరాబద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో తన టాలెంట్‌ను అన్ని విభాగాల్లోనూ చూపించాడు. బ్యాటింగ్‌లో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయినప్పటికీ ఐదు బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కేవలం ఆరు మాత్రమే. ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు.
5. మూడోసారి ఫైనల్స్‌కు రైజర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. 2016లో మొదటి సారి ఫైనల్స్‌కు చేరినప్పుడు కప్ గెలవగా, 2018లో రెండో సారి వెళ్లినప్పుడు చెన్నై చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది మూడో సారి.