Rishabh Pant Injury in India vs England Test | గాయంతో మైదానం వీడిన పంత్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ .. వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో .. బంతి వచ్చి నేరుగా పంత్ కుడి కాలికి తాకింది. దీంతో నొప్పితో పంత్ అల్లాడిపోయాడు. ఆ తర్వాత పంత్ నడవలేకపోయాడు. షూ, సాక్స్ తీసేసిన తర్వాత ఏకంగా రక్తం కారింది. నడవలేకపోవడంతో స్టేడియంలో ఉన్న ఆంబులెన్స్ మైదానంలోకి వచ్చింది. వెంటనే పంత్ ను హాస్పిటల్ కు తీసుకోని వెలారు. 48 బంతుల్లో 37 రన్స్ చేసిన పంత్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు.
పంత్ పరిస్థితి చూస్తుంటే మళ్ళి టీంలోకి వస్తాడా లేదా అన్నది కూడా డౌట్ గానే కనిపిస్తుంది. ఒకవేళ పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు రాకపోతే ఇండియాకు ఎదురుదెబ్బే అవుతుంది. మూడవ టెస్ట్ మ్యాచ్ లో కూడా పంత్ కు గాయమైంది. బుమ్రా వేసిన బాల్ ని క్యాచ్ పట్టే క్రమంలో పంత్ వేలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలవాల్సిందే. మరి పంత్ ఆడతాడా? లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.





















