Rashid Khan Breaks Bhuvi Record Asia Cup 2025 | భువీ రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్... ఆసియా కప్ హిస్టరీలోనే అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసాడు. గతంలో భువి 6 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టి ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు రషీద్ ఒక వికెట్ ఎక్కువ తీసి భువిని సెకండ్ ప్లేస్ లోకి చేర్చాడు. రషీద్ 10 గేమ్స్ లో 14 వికెట్లు పడగొట్టాడు.
టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రషీద్ ఖాన్ ఇప్పటికే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కేవలం 98 మ్యాచ్‌లలోనే 165 వికెట్లు తీసి న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ రికార్డును బద్దలు కొట్టాడు. టిమ్ సౌథీ 164 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా వరుసగా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్నారు.





















