Mohammed Shami Comments in Selection Committee | టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై షమీ కామెంట్స్
టీమ్ ఇండియాలో మహ్మద్ షమీ చెరగని ముద్ర వేసుకున్నారు. తాను ఆడిన ప్రతి మ్యాచ్ లోను ... తన బౌలింగ్ ఎటాక్ తో బ్యాట్స్మన్ కు చుక్కలు చూపిస్తాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో 7 మ్యాచుల్లో 24 వికెట్లు తీసి, సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అత్యద్భుతమైన పర్ఫామెన్స్ తో టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాడు.
అయితే ఇప్పుడు షమీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో కనిపించాడు. గాయం నుంచి కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ కూడా షమీని సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ లో షమీకి చోటు దక్కింది. అయితే టీమ్ ఇండియాలో తన సెలక్షన్ పై షమీ హాట్ కామెంట్స్ చేసాడు. ‘నా ఫిట్‌నెస్ గురించి భారత టీమ్ మేనేజ్‌మెంట్, ఏమీ అడగలేదు. నేను ఫిట్‌గా ఉన్నా, నేను ఆడతాను.. టీమ్‌లో ప్లేస్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్లే అడిగి తెలుసుకోవాలి. అయినా రంజీ మ్యాచ్ ఆడేందుకు సరిపోయే ఫిట్‌నెస్, వన్డే మ్యాచ్ ఆడేందుకు సరిపోదా? నేను ఫిట్‌గా లేకపోతే, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండేవాడిని. అంతేకానీ రంజీ ట్రోఫీ ఆడేవాడిని కాదు కదా.. ’ అంటూ షమీ చెప్పుకొచ్చాడు. ఇపుడున్న పరిస్థితుల్లో సీనియర్ పేసర్ షమీకి టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టం అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.





















