Virat kohli Celebration vs PBKS IPL 2025 | మానసికంగా చంపేస్తాడు..ఏడుపు ఒక్కటే తక్కువయ్యేలా చేస్తాడు | ABP Desam
నిన్న పంజాబ్ మీద క్వాలిఫైయర్ 1 మ్యాచ్ చూసినవాడెవడైనా ఆర్సీబీదే ఈసారి ఐపీఎల్ కప్ అని ఫిక్స్ అవుతాడు. దానికి రీజన్ వైల్డ్ ఫైర్ లా పంజాబ్ పై వాళ్లు విరుచుకుపడిన విధానం. ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ...పంజాబ్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టి మూడు నీళ్లు చెరువులు తాగిస్తుంటే ఆ బాల్స్ నే ఆపుకోవాలా ఆ ఔట్ కే బాధపడాలోతెలియని పరిస్థితుల్లో ఉంటే ఒకడొస్తాండీ. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. గుండెలో దడపుట్టేలా సింహ నాదాలు చేస్తాడు. అసలు ఆ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే చాలు బ్యాటర్ సగం చచ్చిపోతాడు. నువ్వు క్రీజులోకి నీ అంతు అయితే చూస్తా అన్నట్లు పొలికేకలు పెడతాడు. అతనే కింగ్ విరాట్ కొహ్లీ. అడవిలో సింహం గర్జించినట్లు నిన్న కొహ్లీ తన టీమ్ ఆటను సెలబ్రేట్ చేసుకున్న విధానం చూడాలి. ఒక్కో వికెట్ పంజాబ్ ది పడుతుంటే బౌలర్ అన్నా కాస్తా కూస్తో తక్కువ ఆనందపడతాడేమో గాల్లోకి ఏడు అడుగులు ఎత్తుకు ఎగురుతూ...గుండెలు బాదుకుంటూ...చేతులు రెండు బలంగా చాచి అరుస్తూ...పెద్దగా పెద్దగా పొలికేకలు పెడుతూ వామ్మో విరాట్ కొహ్లీ ని ఫేస్ చేయాలంటే చచ్చే చావురా బాబు అన్నట్లు చేశాడు నిన్న కింగ్. దీనికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి విరాట్ లో దాగిన 18ఏళ్ల కసి. బాధ. మూడుసార్లు ఫైనల్ ఆడి మూడు సార్లు కప్ ను తృటిలో మిస్ చేసుకున్న ఆవేదన ఆయితే మరొకటి తన జట్టు ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ ను తార స్థాయికి తీసుకువెళ్లటం.అన్ని వేల పరుగులు చేసిన ఆటగాడు అని వందల మంది బౌలర్లకు పీడకలలు మిగిల్చిన బ్యాటర్ ఒక్కో వికెట్ ను అంత ఎంజాయ్ చేస్తుంటే మరి మిగిలిన జట్టులో జోష్ నిండ కుండా ఉంటుందా. ఎక్కడా నిమిషం కూడా నిస్సత్తువ ఆవహించకుండా అలెర్ట్ గా ఉండేలా కావాల్సిన అడ్రినల్ రష్ పంప్ చేయటంతో పాటు మరింతగా బౌలర్లు రెచ్చపోయేలా వాళ్లను పీక్ లెవల్లో మోటివేట్ చేయటం...అంతే కాకుండా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ గుండె లో రైళ్లు పరిగెత్తేలా చేయటం వాడి కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీయటం, ఫైనల్ గా తన సొంత ఆనందం..ఇలా ఎన్నో లేయర్స్ టాక్టిక్స్ ఉంటాయి విరాట్ సెలబ్రేషన్స్ లో. అందుకే నిన్నంతలా వైల్డ్ ఫైర్ అన్నట్లు రెచ్చిపోయాడు. బ్యాటింగ్ లో 12 పరుగులే చేసినా నిన్న గ్రౌండంతా విరాటుడే కనిపించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత పైన గ్యాలరీలో కూర్చున్న అనుష్కశర్మను చూస్తూ మనం గెలిచాం ఇంక ఒక్క మ్యాచ్ ఉంది అది కూడా సాధిస్తా అన్నట్లు సైగలు చేశాడు. అంతటి కసితో ఉంటాడు కాబట్టే 18ఏళ్లుగా ఆకలిగొన్న పులిలా తన వేట కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తనదైన క్షణాలను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలబడ్డాడు.





















