Virat Kohli 18Years Dream IPL 2025 Final | RCB vs PBKS ఫైనల్ మ్యాచ్ తో 18ఏళ్ల పోరాటం ముగుస్తుందా.?
విరాట్ కొహ్లీ. 18వ నెంబర్ జెర్సీతో 18ఏళ్లుగా ఒకటే కలను కంటున్నాడు. వేరే జట్టుకు మారకుండా సీజన్ ప్రారంభమైన 2008నుంచి ఇదే ఆర్సీబీకి ఆడుతూ ఒక్కసారి తమ జట్టును ఛాంపియన్ గా నిలపాలని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి కానీ కోహ్లీకి ఆ కల మాత్రం తీరటం లేదు. ఐపీఎల్ లో విరాట్ కొహ్లీ సాధించినది లేదు. 266 ఐపీఎల్ మ్యాచుల్లో 8,618 పరుగులు చేశాడు విరాట్. 8 సెంచరీలు, 63హాఫ్ సెంచరీలు..ఐదు సీజన్లలో 600లకు పైగా స్కోర్లు..ఒక్కటీ కాదు బ్యాటింగ్ పరంగా విరాట్ కొహ్లీ ఐపీఎల్ కే అత్యుత్తమ ప్రమాణాలు ఎలా ఉండాలో నేర్పాడు. వరుసగా మూడు సీజన్లలో 600ల పరుగులు సాధించి ఆటగాడిగానూ కెరీర్ పీక్స్ ఫామ్ ను చూపిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా ఎంతో మంది ప్లేయర్లతో కాంబినేషన్లు మారినా...ఆక్షన్లు, సీజన్లు వచ్చి వెళ్లిపోతున్నా ఆర్సీబీ కప్ కల మాత్రం తీరటం లేదు. 18ఏళ్లుగా కొహ్లీ చూస్తున్న ఎదురు చూపులకు ఈ రోజు ఫలితం లభించే అవకాశం ఉంది. పంజాబ్ తో ఈ రోజు జరిగే ఫైనల్ గెలుచుకుంటే చాలు ఆ యోధుడి జీవితంలో సుదీర్ఘ కాల నిరీక్షణ తీరుతుంది. తనను నమ్మి 18ఏళ్లుగా నిలబడుతున్న ఆర్సీబీకి..ఈ సాలా కప్ నమ్మదే అంటూ అంతకంతకు ప్రేమను చూపిస్తూనే ఉన్న అభిమానులకు విరాట్ కొహ్లీ ప్రత్యేకమైన బహుమతిని అందిచినట్లవుతుంది. చూడాలి ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఈ ఒంటరి యోధుడి లక్ష్యం ఈ రోజు నెరవేరుతుందేమో.





















