Vaibhav Suryavanshi Touched MS Dhoni Feet | ఎమ్మెస్ ధోనీ పాదాలకు నమస్కరించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్లకే ఐపీఎల్ ఆడేస్తూ సంచలనం గా మారిన ఈ చిన్న పిల్లాడు మరోసారి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిచేలా చేసి విజయంతో వాళ్ల జర్నీని ఈ సీజన్ లో ముగించేలా చేశాడు వైభవ్ సూర్యవంశీ. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి187పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 43, డెవాల్డ్ బ్రేవిస్ 42పరుగులు, శివమ్ దూబే 39పరుగులు చేశాడు. 188పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే గతంలోలా పూర్తిగా విరుచుకుపడకుండా పరిస్థితికి తగ్గట్లుగా ఆడుతూ రాజస్థాన్ ను ఛేజింగ్ లో ముందుకు తీసుకువెళ్లాడు. అలా 33 బాల్స్ లో 4ఫోర్లు 4 సిక్సర్లతో 57పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ..తను అవుట్ అయ్యే టైమ్ కి 13 ఓవర్లలో 138పరుగుల టీమ్ స్కోరు పెట్టాడు. దీంతో రాజస్థాన్ పని ఈజీ అయిపోయింది. మిగిలిన టార్గెట్ ను సంజూ శాంసన్ తో కలిసి ధృవ్ జురెల్ కంప్లీట్ చేయటంతో రాజస్థాన్ ఘన విజయం సాధించి లీగ్ ను విజయంతో ముగించింది. ఇంతా డామినేట్ చేసి మ్యాచ్ ను చెన్నై చేతుల్లో నుంచి లాగేసుకున్న వైభవ్ సూర్యవంశీ మాత్రం మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే టైమ్ లో సీఎస్కే కెప్టెన్ ధోనీ కాళ్లకు మొక్కాడు. తనకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ధోనీ కాళ్లకు వంగి నమస్కరించిన ఆశీర్వాదం తీసుకున్న వైభవ్ సూర్యవంశీ ధోనీ ప్రశంసలకు నవ్వుతూ థాంక్యూ చెప్పాడు. 20ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న 43ఏళ్ల ధోనీ ఈ తరం ఆటగాళ్లలోనూ సంపాదించుకున్న రెస్పెక్ట్ అదంటూ ఐపీఎల్, సీఎస్కే, రాజస్థాన్ ఫ్రాంచైజీలు ఈ ఫోటో, వీడియోలను వైరల్ చేస్తున్నాయి. ఈ లీగ్ లో ఆడుతున్న అత్యంత పెద్ద వయస్కుడు ధోనీ కాగా..అత్యంత చిన్న వయస్సు వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. అతి ఎక్కువ వయస్సులో ధోనీ, అతి చిన్న వయస్సులో వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న రికార్డులను తమ పేరు మీద రాసుకున్నారు. మరోవైపు సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం అటు సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ కి, ఇటు వైభవ్ సూర్యవంశీ లాంటి ఫ్యూచర్ సూపర్ స్టార్లకు ధోనీ అంటే అభిమానం అనీ..20ఏళ్ల కెరీర్ లో తను సంపాదించుకున్న రెస్పెక్ట్ ఇదంటూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.





















