SRH Chocking RCB in IPL History | 18ఏళ్లుగా బెంగుళూరు కప్పు కలను దూరం చేస్తున్న హైదరాబాద్
నిన్న ఆర్సీబీపై 42పరుగుల తేడాతో విక్టరీ సాధించింది సన్ రైజర్స్. హైదరాబాద్ కి అస్సలు పోయేదేం లేదు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయారు. మరి నష్టపోయింది ఎవరు ఆర్సీబీ. నెట్ రన్ రేట్ ను భారీగా కోల్పోవటంతో పాటు రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. చూడటానికి ఏం ఉంది ఒక్క మ్యాచే కదా....ఇంకో మ్యాచ్ ఉందిగా గెలుస్తుంది ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకోవచ్చు. గెలవకపోతే.? అదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎవరినీ తేలిగ్గా తీసుకోలేం కదా. ఆడబోయేది LSG మీదే కదా అనుకోవచ్చు. బట్ అదే LSG ఎలిమినేట్ అయిన తర్వాత మొన్న టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ నే ఓడించింది. ఎవరికి తెలుసు RCB కి కూడా షాక్ ఇస్తుందే. హా ఇస్తే ఏమవుతుంది అనుకుంటే అక్కడే ప్రతీసారి RCB కి దెబ్బ పడేది. టాప్ 2 లో ఉంటే ఫైనల్ ఆడటానికి RCB చేతిలో రెండు అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయర్ 1 లో ఓడిపోయిన జట్టుకు ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ RCB దరిద్రం బాగోక క్వాలిఫైయర్ 1 లో ఓడినా క్వాలిఫైయర్ 2 ఆడుకునైనా ఫైనల్ కి వెళ్లొచ్చు ఏమో చూడొచ్చు. అది జరగాలంటే RCB టాప్ 2 లో ఉండాలి. సరిగ్గా అదే అవకాశాన్ని చావు దెబ్బగొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదేం మొదటి సారేం కాదు ఇదే ఆఖరి సారి అని కూడా చెప్పలేం. 2009 నుంచి ఈసాలా కప్ నమ్మదే అనే ప్రతీ అవకాశాన్ని చెడగొడుతోంది హైదరాబాదే. ఆర్సీబీ ఎప్పుడూ ముంబై, చెన్నైలతో పోల్చుకుంటుంది కానీ ఆర్సీబీకి అసలు రిస్క్ తెస్తూ ప్రతీసారి బిర్యానీ పెట్టి పంపిస్తోంది ఆరెంజ్ ఆర్మీనే.
2009 final
2012 do or die
2016 finals.
2020 eliminators.
2021 must-win game
మళ్లీ నిన్న
2025 ప్లే ఆఫ్స్ టాప్ 2 వెళ్లాలంటే అడ్డుపడిన వైనం. ఇలా చరిత్ర చూసుకుంటే ప్రతీసారి ఆర్సీబీ కలలపై హుస్సేన్ సాగర్ నీళ్లు చల్లుతోంది హైదరాబాదే. 18ఏళ్లుగా ఒక్క కప్ కోసం విరాట్ కొహ్లీ పోరాడేలా చేస్తోంది. మరి ఆర్సీబీ గుర్తించని ప్రియశత్రువు హైదరాబాద్ ఇచ్చిన షాక్ రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాలంటే ఆర్సీబీ కనీసం నెక్ట్స్ రెండు మ్యాచ్ ల రిజల్ట్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఓడిందా ఆ క్రెడిట్ అంతా హైదరాబాద్ ఖాతాకే.





















